మకర సంక్రాంతి రోజున ఈ పనులు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందా.. ?

by Sumithra |
మకర సంక్రాంతి రోజున ఈ పనులు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందా.. ?
X

దిశ, ఫీచర్స్ : హిందూ మతంలో మకర సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు నుండి అన్ని శుభకార్యాలు ప్రారంభమవుతాయి. మకర సంక్రాంతి రోజున చేసే నదీస్నానం, దానధర్మాలు, పూజలు ఎంతో పుణ్యాన్ని కలిగిస్తాయి. ఈ రోజున ఏదైనా దానం ఫలితాలు రెట్టింపు అవుతుందని నమ్ముతారు. అందుకే ఈ రోజున పూజలు, నదీస్నానాలు, దానాలు ఎక్కువగా చేస్తారు. అంతే కాదు మకర సంక్రాంతి రోజున కొన్ని పనులను చేస్తే లక్ష్మీ దేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందని భక్తులు నమ్ముతారు. మకర సంక్రాంతి రోజున కొన్ని పనులు తప్పక చేయాలని నమ్ముతారు. ఆ పనులు ఏమిటో తెలుసుకుందాం..

పవిత్ర నదిలో స్నానం చేయండి..

మకర సంక్రాంతి రోజున పవిత్ర నదులలో స్నానమాచరించడం విశేషం. ఈ రోజున గంగామాత భూమిపైకి వచ్చిందని ప్రతీతి. అందుకే మకర సంక్రాంతి రోజు గంగానదిలో స్నానం చేయడం పుణ్యంగా భావిస్తారు.

నువ్వుల గింజలతో హవనం చేయండి..

మకర సంక్రాంతి రోజున ఆవునెయ్యిలో తెల్లనువ్వులను కలిపి లక్ష్మీదేవి శ్రీ సూక్త హవనం చేయడం ద్వారా లక్ష్మీదేవి ఇంట్లో నివసిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయని భక్తుల ప్రగాఢ నమ్మకం.

నువ్వుల దానం..

మకర సంక్రాంతి రోజున నలుపు, తెలుపు నువ్వులు, బెల్లం తేనె రెండింటినీ దానం చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయట.

ఆవుకు పచ్చి మేత తినిపించండి

హిందూ మతంలో ఆవును లక్ష్మీ దేవిగా భావిస్తారు. 33 కోట్ల మంది దేవతలు గోవులో నివసిస్తారు. మకర సంక్రాంతి రోజున ఆవుకు పచ్చిమేత తినిపిస్తే సంతోషం, సౌభాగ్యం పెరుగుతాయని నమ్మకం.

ఖిచ్డీ దానం

మకర సంక్రాంతి రోజున ఖిచ్డీని తయారు చేయడం, తినడం, దానం చేయడం ద్వారా లక్ష్మీదేవి కటాక్షిస్తుందని చెబుతున్నారు. ఈ రోజున ఖిచ్డీని పూజలో నైవేద్యంగా పెట్టి, ప్రసాదంగా తిని, ఖిచ్డీని దానం చేస్తే సర్వదోషాలు తొలగిపోతాయని విశ్వాసం.

పిత్రు తర్పణం

మకర సంక్రాంతి రోజున పితృ తర్పణం కూడా చేస్తారు. ఈ రోజున పితృ తర్పణం చేయడం వల్ల ఇంట్లో సుఖశాంతులు చేకూరుతాయట. పూర్వీకుల ఆశీస్సులు వంశాభివృద్ధిని పెంపొందిస్తుందని విశ్వసిస్తారు.

చీపురు కొనడం

ధంతేరస్ లాగా, మకర సంక్రాంతి రోజున చీపురు కొనడం కూడా శుభప్రదంగా పరిగణిస్తారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుందని చెబుతారు.

కోరికల నెరవేరేందుకు మంత్రం

ఓం హ్రీం హ్రీం సూర్యై సహస్రకిరణరై మనోవాంచిత్ ఫలం దేహి దేహి స్వాహా ।

మకర సంక్రాంతి రోజున 108 సార్లు ఈ మంత్రాన్ని పఠిస్తే ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయని నమ్మకం.

సూర్యభగవానుడు, శనిదేవుని ఆరాధన

మకర సంక్రాంతి రోజున సూర్య భగవానుడితో పాటు శని దేవుడిని ఆరాధించడం వలన ఉద్యోగ, వ్యాపారాలలో పురోగతికి దారితీస్తుందని, కష్టాల నుండి ఉపశమనం పొందుతారని నమ్ముతారు.

Advertisement

Next Story

Most Viewed