శృంగార కీర్తనల స్వామి.. ఆయన కోరిక తీర్చాలంటే అలా ప్రదక్షిణలు చేయాల్సిందే..!

by Sumithra |   ( Updated:2023-02-09 12:09:59.0  )
శృంగార కీర్తనల స్వామి.. ఆయన కోరిక తీర్చాలంటే అలా ప్రదక్షిణలు చేయాల్సిందే..!
X

దిశ, వెబ్ డెస్క్ : ఆ ఆలయం లోపల అంతా చీకటే.. గర్భగుడిలో దీపం వెలుగు లేకున్నా ఆ సౌమ్యనాధేశ్వరుడు నిండుపున్నమి చంద్రునిలా భక్తులకు దర్శనం ఇస్తూ ఉంటారు. భక్తుల మనసులో ఉన్న కోరికలను నిండు మనసుతో తీరుస్తూ ఉంటాడు. అందుకే భక్తులు స్వామి వారిని కామితార్థప్రదాయనుడిగా భావిస్తారు. కోరికలు కోరడానికి ముందు, కోరికలు తీరిన తరువాత స్వామి ఆలయం చుట్టూ మనస్ఫూర్తిగా ప్రదక్షిణలుగావిస్తారు భక్తులు. అక్కడ కోరికలుకోరి ప్రదక్షిలు చేస్తే అవి తప్పకుండా జరుగుతాయని భక్తుల నమ్మకం. ఇంతకీ ఆలయం ఎక్కడ ఉంది... ఆలయ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

చోళవంశరాజు కుళోత్తుంగచోళుడు 11వ శతాబ్దంలో సౌమనాధేశ్వర స్వామి ఆలయ నిర్మాణం మొదలుపెట్టినట్టు చరిత్ర చెబుతుంది. 17వ శతాబ్దం వరకు ఈ ఆలయ నిర్మాణ పనులు కొనసాగాయి. ఆలయ నిర్మాణం చోళ, పాండ్య, కాకతీయ, విజయనగర మహారాజుల హయాంలో కొనసాగింది. ఈ ఆలయానికి గాలిగోపురాన్ని కాకతీయ ప్రతాపరుద్రుడు 12వ శతాబ్దంలో కట్టించారు. స్వామివారి ఆలయానికి శంఖచక్రాలను, రత్న కిరీటాన్ని, రత్నాల పరాశరం, జువ్వల కమ్మలు ఇతర స్వర్ణాభరణాలను 16వ శతాబ్దంలో తిరువెంగనాథుని పట్టపురాణి చెన్నమణి జక్కల తిమ్మసాని బహూకరించినట్లు శాసనాలు తెలుపుతున్నాయి. శాసనాల ప్రకారం ఈ ఆలయానికి 120 ఎకరాల మాన్యం ఉన్నట్లు తెలుస్తుంది. అంతే కాదు ప్రతినిత్యం వేంకటపతి నామస్మరణ చేస్తూ ఎన్నో గేయాలను రాసిన తాళ్ళపాక అన్నమాచార్యులు ఆ ఆలయాన్ని సందర్శించారని పురాణాలు చెబుతున్నాయి. అంతే కాదు సౌమ్యనాధేశ్వరునిపై పలు శృంగార కీర్తనలు రచించినట్లు కుడా చారిత్రక ఆధారాలున్నాయి.

స్థలపురాణం..

నారద మహర్షి కోరిక మేరకు భూలోకానికి వచ్చిన శ్రీమహావిష్ణువు బాహుదానది పరిసరాల్లో ఉన్న భూలోక వింతలను చూస్తూ మైరచిపోయాడట. ప్రశాంత వాతావరణం, ప్రకృతి అందాలను చూస్తూ అలాగే ముగ్ధుడైనాడట. ఎంత అందమైన ప్రకృతి సోయగాలు, స్వర్గలోకాన్ని తలపించే రమణీయతలు ఆహా అంటూ మైరచిపోయాడు సౌమ్యనాధేశ్వరుడు. అప్పుడు నారదమహర్షి స్వామివారితో ఇలా అన్నారు. స్వామి కలియుగంలో బాహుదానదీ తీరంలో కొలువై భక్తుల కోరికలు తీర్చాలంటూ ప్రార్థించాడట. ఆయన కోరిక మేరకు సౌమ్యనాథుడు నదీతీరంలో శిలారూపం ధరించాడట. మరికొన్ని కథనాల ప్రకారం సాక్షాత్తు నారదమహర్షే స్వయంగా స్వామివారిని ప్రతిష్ఠించాడని చెబుతున్నాయి.

ఈ ఆలయ గర్భగుడిలో ఉండే మూలవిరాట్టు ఉదయం నుండి సాయంత్రం వరకు ఎలాంటి దీపం వెలుగు లేకపోయినా అద్భుతంగా దర్శనం ఇచ్చేవిధంగా ఆలయ నిర్మాణం చేశారు. దాదాపు 7 అడుగుల ఎత్తుగల పద్మపీఠంపై సౌమ్యనాథస్వామి కనిపిస్తాడు. చతుర్భుజుడుగా ఉన్న సౌమ్యనాధుడు రెండు చేతులలో శంఖు చక్రాలు, ఎడమ చేయి వరద ముద్ర, కింది కుడిచేయి అభయ ముద్రలలో ఉంటాయి. ప్రధానద్వారానికి 100 గజాల దూరంలో ఉండే గర్భగుడిలోని మూలవిరాట్టు స్పష్టంగా కనిపిస్తాడు. స్వామివారి పాదాలపై సంవత్సరంలో ఒకరోజు సూర్యుని తొలికిరణాలు ప్రసరించే విధంగా శిల్పులు ఆలయాన్ని నిర్మించారు.

ఆలయం చుట్టూప్రహారీ ఉత్తరదిశలో 3 అంతస్తుల గోపురం, తూర్పువైపున ఉన్న ఆలయ ప్రవేశద్వారం పైన ఐదు అంతస్తుల రాజగోపురాన్ని నిర్మించారు. ఆలయాన్ని నిర్మించిన శిల్పలు ఎంతో నైపుణ్యంతో శిలా దీపస్తంభాన్ని నిర్మించారు. ఈ స్తంభం ఆలయం లోపలికి ప్రవేశించగానే దర్శనం ఇస్తుంది. ప్రధాన ఆలయం ఆస్థాన మండపం, ముఖమండపం, మహామండపం, అంతరాళం గర్భాలయాల సముదాయం ఉంటుంది. ఈ ఆలయంలో తెలుగు శాసనాలు తక్కువగా, తమిళ శాసనాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ శాలనాల్లో కొన్నింటిపై సూర్యచంద్రుల చిహ్నాలు ఉంటాయి. ఈ ఆలయంలో సింహాల తలలు క్రింది భాగంలో ఉంటాయి. దీంతో ఆలయం క్రింది భాగంలో మరో ఆలయం ఉన్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఈ ఆలయం బయట ఒక కోనేరు, లోపల మరో కోనేరు ఉన్నాయి.

Read more:

వేశ్యలకు అలవాటు పడిన అర్చకుడు.. గండం తప్పించుకునేందుకు శివలింగానికి కొప్పు..!?

గ్రామ దేవతల వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే


Advertisement

Next Story