Balkeshwar Temple : 700 ఏండ్ల నాటి శివలింగం.. అక్కడికి వెళ్లారంటే 40 రోజుల్లో కోరికలు సఫలం..

by Sumithra |
Balkeshwar Temple : 700 ఏండ్ల నాటి శివలింగం.. అక్కడికి వెళ్లారంటే 40 రోజుల్లో కోరికలు సఫలం..
X

దిశ, ఫీచర్స్ : ప్రపంచవ్యాప్తంగా అనేక పురాతన శివాలయాలు ఉన్నాయి. ఒక్కో దేవాలయానికి ఒక్కో ప్రత్యేకత, అద్భుతమైన పురాణ కథలు ఉన్నాయి. ఇక శ్రావణ మాసం, కార్తీక మాసం వచ్చిందంటే చాలు శివాలయాలకు భక్తులు పోటెత్తుతారు. ఆ మహాదేవున్ని ప్రసన్నం చేసుకోవడానికి వివిధ పద్ధతులను అవలంబించడం ప్రారంభిస్తారు. శివుని ఆలయాలకు వెళుతూ పూజలు, అభిషేకాలు చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆలయంలోని శివలింగం సుమారుగా 700 సంవత్సరాల పురాతనమైనదిగా చరిత్ర చెబుతుంది. ఈ లింగాన్ని బెల్పాత్ర అడవుల్లో భక్తులు కనుగొన్నారని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయానికి భక్తులు వరుసగా 40 రోజులు వచ్చి శివయ్యను కొలిస్తే చాలు వారి కోరికలన్నీ నెరవేరుతాయని అక్కడి భక్తులు విశ్వసిస్తారు. ఇంతకీ ఈ ఆలయం ఎక్కడ ఉంది, దాని చరిత్ర ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం.

ఆగ్రా పేరు చెప్పగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది తాజ్ మహల్. కానీ తాజ్ మహల్ కాకుండా, ఆగ్రాలో అనేక పురాతన, ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. కైలాష్ మహాదేవ్, రాజేశ్వర్ మహాదేవ్, పృథ్వీనాథ్, మంకమేశ్వర్ లాగానే ఇక్కడ కూడా బాలేశ్వర టెంపుల్ కూడా ఉంది. ఈ ఆలయం తాజ్ మహల్ నుండి కేవలం 7 కి.మీ దూరంలో ఉత్తర ప్రదేశ్, రాజ్‌వాడ, కైలాష్ నగర్, అలకేశ్వర్ ఘాట్ వాసన్ వద్ద ఉంది.

శివలింగం ఎక్కడ ఎలా దొరికింది ?

బల్కేశ్వర్ మహాదేవ్ ఆలయం ఉన్న ప్రదేశంలో పూర్వం బిల్వపత్ర అంటే బేల్పత్ర వృక్షాలు ఉండేవని చెబుతారు. సుమారు 700 సంవత్సరాల క్రితం అడవిని నరికివేసినప్పుడు, ఇక్కడ ఒక అద్భుతమైన శివలింగం, ఆలయం కనుగొన్నారని చెబుతారు. బెల్పత్ర అడవిలో ఉన్నందున, ఈ ఆలయాన్ని బిల్వకేశ్వర్ మహాదేవ్ ఆలయం అని పిలిచేవారు. ఇప్పుడు ఈ ఆలయం బల్కేశ్వర్ మహాదేవ్ ఆలయంగా మారింది. నేటికీ యమునా నది ఈ ఆలయానికి సమీపం నుంచి పారుతుంది.

40 రోజుల్లో నెరవేరుతున్న కోరికలు..

ఏ భక్తుడైనా ఇక్కడి భోలాశంకున్ని హృదయపూర్వకంగా పూజిస్తే, అతని ప్రతి కోరిక నెరవేరుతుందని ఆలయానికి అక్కడి భక్తులు చెబుతుంటారు. ఈ ఆలయంలో గంధం, కుంకుమతో శివుని ప్రతిష్ట, అలంకారం జరుగుతుంది. దాన్నే భక్తులకు ప్రసాదంగా కూడా పంపిణీ చేస్తారు. ఏ భక్తుడైనా 40 రోజుల పాటు ఆలయానికి వచ్చి బల్కేశ్వర్ నాథ్‌కి నీళ్లు సమర్పించాలని చెబుతారు. అప్పుడే కోరికలు నెరవేరుతాయట.

ప్రత్యేకమైన అలంకరణ...

బల్కేశ్వర్ ఆలయంలో ప్రత్యేక ఆకర్షణ శివలింగానికి అద్భుతమైన అలంకరణ. ఆలయంలో గంధం, కుంకుమలతో శివుని ప్రతిష్ఠాపన, అలంకారం చేస్తారు. దీని ప్రసాదాన్ని భక్తులకు అందజేస్తారు.

శ్రావణమాసం..

శ్రావణమాసంలో బల్కేశ్వర్ ఆలయంలో ప్రతిరోజూ శివలింగాన్ని అలంకరిస్తారు. దీనితో పాటు జాతర కూడా నిర్వహిస్తారు. ఈ జాతరలో 70 కోసుల పాదయాత్ర ప్రారంభిస్తారు. ఈ యాత్ర కైలాష్, పృథ్వీ టెంపుల్ గుండా వెళ్లి బల్కేశ్వర్ టెంపుల్ వద్ద ఆగుతుంది. శతాబ్దాలుగా ఈ పరిక్రమ సంప్రదాయం ఇలాగే కొనసాగుతోందని అక్కడి భక్తులు పండితులు చెబుతారు.

గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహనకోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు.

Advertisement

Next Story

Most Viewed