Hanumanthudu: రాముడు, హనుమంతునికి ఇచ్చిన వరం ఏమిటో తెలుసా?

by Prasanna |   ( Updated:2023-03-18 03:29:26.0  )
Hanumanthudu: రాముడు, హనుమంతునికి ఇచ్చిన వరం ఏమిటో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్ : లంకలో రావణుడిని సంహరించిన తర్వాత రాముడు తన వారందరితో కలిసి అయోధ్యకు తిరిగి వచ్చాడు. రాముడు వచ్చే వరకు రాముడు పాదరక్షలతో రాజ్యాన్ని ఏలిన శత్రుజ్ఞుడు, భరతుడు అన్న రాకతో రాజ్యం మొత్తాన్ని రాముడుకు అప్పజెప్పారు. శ్రీ రాముని పట్టాభిషేకం చాలా రోజుల వరకు జరిగింది. రాముడు వెంట వచ్చిన వానరులు, రాక్షసులు 60రోజుల పాటు అయోధ్యలో గడిపి వారు కూడా అక్కడి నుంచి బయలుదేరారు. వానరుల్లో చివరి వంతు హనుమంతుడికి వచ్చింది.. వెళ్లి పోతున్న సమయంలో హనుమంతుడు ఇలా కోరాడు. ప్రభువా.. నా విన్నతి మన్నించు.. నిత్యం నీ భక్తుడిగా ఉంటూ నిన్ను పూజించేలా నన్ను ఆశ్వీదరించు ఇకపై రామకథా పారాయణం కొనసాగుతున్నంత వరకు నేను బ్రతికి ఉండేలా నన్ను కరుణించ అని కోరుకున్నాడు. హనుమంతుడికి కోరికకు మెచ్చి అతన్ని దగ్గరకు తీసుకొని హత్తుకొని.. ప్రజలు నా గాధ పారాయణం చేస్తున్నంత కాలం నీ కీర్తి దశ దిశలుగా వ్యాపిస్తూనే ఉంటుందని చెప్పాడు.

Advertisement

Next Story

Most Viewed