- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బెల్లం పానకం, వడపప్పులు తయారు చేసేటప్పుడు ఈ పొరపాట్లు చేయకండి?
దిశ, ఫీచర్స్ : శ్రీరామనవమి నాడు హిందువులందరూ రాముడికి వడపప్పు, బెల్లం పానకం తయారుచేస్తారు. వడపప్పు, బెల్లం పానీయాలు సులభంగా తయారు చేసుకోవచ్చు. బెల్లం పానీయం తాగడం వల్ల ముఖ్యంగా వేసవిలో చలువ చేస్తుందని చెబుతారు. వేడి సమస్యలున్న వారు బెల్లం పానకం తీసుకుంటే వెంటనే ఉపశమనం పొందుతారు. బెల్లం పానకం ఎక్కువగా తీసుకోవడం వలన కడుపు నొప్పి వస్తుంది. వీటిని తయారు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..
బెల్లం పానకం చేసేటప్పుడు జాగ్రత్తలు..
బెల్లంపానకం చేసేటప్పుడు కొందరు బెల్లంను సరిగా తురుముకోరు. అలాగే ఉండలుగానే వేస్తారు. ఇలా చేయడం వల్ల బెల్లం నీటిలో సరిగ్గా కరగదు. అలాగే యాలకులు, మెంతులు, మిరియాలు కూడా పొడి లాగా చేసుకొవాలి. యాలకుల పొట్టు తీసి తీసి వేసుకోవాలి. యాలకులు, సోంఠి,మిరియాలను బెల్లం నీళ్లలో అలానే వేస్తే, గొంతులో మంట వచ్చే అవకాశం ఉంది.
వడపప్పు తయారీలో ఈ తప్పులు చేయకండి
ముందుగా పప్పును ఒక గిన్నెలో వేసుకోవాలి. తర్వాత నీటితో కడగాలి. ఎక్కువగా నీళ్ళు పోయకండి. కొంతమంది తమ పెసరపప్పును నీళ్లతో నింపి గంటల తరబడి అలాగే ఉంచుతారు. ఇలాంటి పనులు చేయడం వల్ల ఒక రకమైన దుర్వాసన వస్తుంది. అందువల్ల, మీరు పెసరపప్పును 10 నిమిషాలు నీటిలో నానబెట్టి, ఆ తర్వాత, నీళ్లను కిందకు పొయేలా వడకట్టాలి.