- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శ్రీకృష్ణుడు 16 వేల వివాహాలు ఎందుకు చేసుకున్నాడో తెలుసా..
దిశ, ఫీచర్స్ : ద్వాపర యుగంలో విష్ణువు కృష్ణుడి రూపంలో భూమిపై జన్మించాడు. శ్రీ కృష్ణ పరమాత్ముడు ధర్మాన్ని రక్షించడానికి అనేక రకాల కృషి చేశాడు. మనిషి ధర్మం కోసం జీవించాలని శ్రీ కృష్ణుడు గీతలో అర్జునుడికి వివరించాడు. అలాగే మనిషి తన జీవితాన్ని ఎలా గడపాలో పూర్తి జ్ఞానాన్ని ఇచ్చాడు. అలాంటి శ్రీ కృష్ణుడికి సంబంధించిన ఆసక్తికరమైన కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఇంతకీ ఆ కథ ఏంటి అనుకుంటున్నారా అయితే ఇప్పుడు తెలుసుకుందాం.
16,000 మంది గోపికలతో పెళ్లి ?
పురాణాల ప్రకారం నరకాసురుడు చాలా మంది రాజులను ఓడించి, వారి కుమార్తెలను బంధించి, ఆ 16,000 మంది గోపికలను జైలులో పెట్టాడు. అప్పుడు శ్రీకృష్ణుడు స్వయంగా యుద్ధం చేసి నరకాసురుడిని సంహరించి 16,000 మంది గోపికలను చెర నుండి విడిపించాడు. అయితే అప్పటికే నరకాసురుడు చాలా మంది బాలికల కుటుంబాలను చంపాడు. మిగతా బాలికల కుటుంబ సభ్యులు వారు ఇంటిలోనికి రావడానికి నిరాకరించి వారిని విడిచిపెట్టారు.
అప్పుడు ఆ అమ్మాయిలందరూ శ్రీ కృష్ణ భగవానుని అభ్యర్థించారు. మీరు మా ప్రాణాలను కాపాడారు, కానీ ఇప్పుడు మేము ఒంటరిగా ఎక్కడికి వెళతాము అని. దాంతో శ్రీకృష్ణుడు ఆ అమ్మాయిలందరి గౌరవాన్ని కాపాడటానికి 16 వేల రూపాలలో కనిపించి వారిని వివాహం చేసుకున్నారు.
శ్రీకృష్ణుడికి 8 మంది రాణులు ?
అలాగే శ్రీకృష్ణుడికి ఎనిమిది మంది రాణులు ఉన్నారు. వీరి పేర్లు రుక్మణి, జాంబవతి, సత్యభామ, కాళింది, మిత్రబింద, సత్య, భద్ర, లక్ష్మణ.