- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అసలు జీసస్ ను సిలువకు ఎందుకు వేశారో తెలుసా ?
దిశ, ఫీచర్స్ : గుడ్ ఫ్రైడే పండుగను ఈసారి మార్చి 29న జరుపుకుంటున్నారు. క్రైస్తవ మతస్తుల ఈ పండుగ ప్రభు యేసుక్రీస్తు త్యాగానికి ప్రతీకగా చెబుతారు. ఈ రోజున యేసు క్రీస్తును సిలువవేశారని హిస్టరీ చెబుతుంది. ప్రజలు ఎల్లప్పుడూ సరైన మార్గంలో నడవాలని, మతాన్ని అనుసరించాలనే సందేశాన్ని ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చాడు. అయితే ఈ పండగను క్రైస్తవ సమాజ ప్రజలు అనేక పేర్లతో పిలుస్తారు. చాలా మంది దీనిని గ్రేట్ ఫ్రైడే అని పిలుస్తారు. కొన్ని ప్రదేశాలలో దీనిని బ్లాక్ ఫ్రైడే అని పిలుస్తారు.
మరికొంతమంది దీనిని గుడ్ ఫ్రైడే అని పిలుస్తారు. అలాగే ఈ రోజుకు పవిత్ర శుక్రవారం అనే పేరు కూడా ఉంది. దీవెనలు ఇచ్చే, స్వీకరించే రోజు అని అంటారు. అలాగే ఈ రోజున భగవంతుని స్మరించుకోవాలని చెబుతారు. ఈ రోజున క్రైస్తవ మతానికి చెందిన వారు నల్ల బట్టలు ధరించి చర్చికి వెళ్లి ఇక్కడ జీసస్ ను స్మరించుకుంటారు. చాలా మంది బాధలో ఏడుస్తారు కూడా. ఈ ప్రత్యేకమైన రోజున, ప్రియమైనవారికి సందేశాలు పంపుతూ యేసుక్రీస్తు చేసిన త్యాగం ప్రాముఖ్యతను తెలియజేస్తారు.
జీసస్ ను ఎందుకు సిలువ వేశారు..
ఏసుక్రీస్తు ఎప్పుడూ తోటివారిని ప్రేమించేవారు. ఎవరికీ హాని తలపెట్టకుండా ఆపదలో ఉన్నవారికి రక్షణగా ఉండేవాడు. అలాగే తమ తోటి వారిని ప్రేమించాలని చెప్పేవారు. యేసుక్రీస్తు ప్రజలకు మానవత్వం పట్ల సానుకూల సందేశాలను ఇస్తూ, మంచి బోధనలు చేసేవారు. అంతే కాదు ప్రాణాపాయంలో ఉన్న ప్రజలను రక్షించి, ఆకలితో అలమటించే పేదవారికి ఆహారం పెట్టేవాడు. దీంతో ప్రజలు యేసుక్రీస్తును దేవుడిగా భావించడం ప్రారంభించారు. ఆయన చెప్పిన మార్గంలోనే ప్రజలు నడవడం మొదలు పెట్టారు. అక్కడ ఉన్న కొంతమంది మత పెద్దలకు ఇది ఇష్టం లేదు. దీంతో ఈ విషయం అప్పటి రోమ్ పాలకుడికి చేరుకుంది. ఏసు క్రీస్తుకు వస్తున్న ఆదరణను చూసిన మతాధిపతులు దాన్ని సహించలేకపోయారు. ఆయన చేసే పనులపై, ఆయన పై దుష్ర్పచారం చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఏసుక్రీస్తుకు మరణదండన వేయాలని ఆదేశాలు స్వీకరించారు.
అప్పటికే ఏసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు అన్న విషయాలు వీరికి తెలియకపోవడంతో ఎలాగైనా కనిపెట్టాలనుకున్నారు. దానికోసం క్రీస్తు శిష్యులలో ఒకరికి 30 వెండి నాణేలను రోమన్ మతాధిపతులు లంచంగా అందించారు. అవి తీసుకున్న క్రీస్తు శిష్యుడు క్రీస్తు జాడను చెప్పి gethsemane అనే తోటలో జీసస్ ప్రార్థన చేస్తున్న సమయంలో రోమన్ సైనికులకు చూపిస్తాడు. దీంతో రోమన్ సైనికులు వెంటనే జీసస్ ను తమఆధీనంలోకి తీసుకుని శిలువ వేస్తారు. ఎవరికీ హాని చేయని జీసస్ కొందరు పన్నిన కుట్రలకు ప్రాణాలను కోల్పోయాడు..! అప్పటి నుండి ఈ రోజును గుడ్ ఫ్రైడే లేదా బ్లాక్ ఫ్రైడే గా జరుపుకోవడం ప్రారంభించారు. యేసుక్రీస్తును విశ్వసించే వారు ఆయన త్యాగాన్ని ఎన్నటికీ మరచిపోరు.