- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చిన్నారుల తల పై భోగిపళ్లు ఎందుకు పోస్తారో తెలుసా..
దిశ, ఫీచర్స్ : ఎప్పుడెప్పుడా అని తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదురుచూస్తున్న సంకాంత్రి పండుగ రానేవచ్చేసింది. నాలుగు రోజుల పాటు ఈ పండగను ప్రజలు అంగరంగవైభవంగా జరుపుకోనున్నారు. నాలుగు రోజుల పండగలో మొదటి రోజును భోగిగా నిర్వహిస్తారు. ఈ రోజున తెల్లవారుజామునే భోగిమంటలను వేసి ఆటలు, పాటల కార్యక్రమాలను నిర్వహిస్తారు. అంతే కాదు భోగిరోజున చిన్నారుల తల పై రేగిపళ్లను భోగి పళ్లను పోస్తారు.. అసలు ఇలా ఎందుకు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం..
భోగి పండుగ రోజున ఉదయాన్నే భోగిమంటలు వేసుకుని సంబురాలు జరుపుకుంటే.. అదేరోజు సాయం సంధ్యాకాళంలో చిన్నారుల తల పై వారి తల్లిదండ్రులు, ముత్తైదువులు భోగిపండ్లను పోసి ఆశీర్వాదం ఇస్తారు. 12 సంవత్సరాల వరకు ఉన్న చిన్నారుల తలపై ఈ పండ్లను పోస్తారు. రేగుపండ్లను చిన్నారుల తలపై పోస్తే నర దిష్టి తొలగిపోతుందని, ఆయురారోగ్యాలతో ఉంటారని పండితులు చెబుతున్నారు. అంతే కాదు పిల్లల తలపై రేగి పండ్లను పోయడం వలన పిల్లలకు మేధస్సు కూడా పెరుగుతుందట. భోగి పండ్లను గుప్పిట నిండా తీసుకుని పిల్లలచుట్టూ మూడుసార్లు తిప్పి వాళ్ల తల మీద పోస్తారు. భోగిపండ్లు పోసిన రేగి పండ్లను ఎవరూ తినరు.