- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లవకుశులు జన్మించిన పుణ్యస్థలం ఎక్కడో తెలుసా..
దిశ, వెబ్‌డెస్క్ : మహర్షి వాల్మీకి ఆశ్రమం బాగ్‌పత్ జిల్లాలో ఉంది. ఇది రామాయణ కాలానికి సంబంధించిన పవిత్ర స్థలం. ఈ ఆశ్రమానికి పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోనే కాదు, దేశం మొత్తం మీద ప్రాముఖ్యత ఉంది. ప్రజలు ఆ ఆశ్రమాన్ని విశ్వాసానికి పెద్ద కేంద్రంగా చూస్తారు. రామాయణానికి సంబంధించిన సంఘటనలను తెలుసుకోవడానికి, శ్రీరాముని జీవితానికి సంబంధించిన అనేక విషయాను తెలుసుకునేందుకు ప్రజలు ఈ చారిత్రక ప్రదేశానికి వస్తుంటారు.
లువకుశుల జన్మస్థలం...
మహంత్ ఆనందేశ్వర్ గిరి మహారాజ్ తెలిపిన వివరాల ప్రకారం లువకుశులు ఈ ఆశ్రమంలో జన్మించారని తెలిపారు. రాముడు సీతను విడిచిపెట్టినప్పుడు, లక్ష్మణుడు ఆమెను ఈ ప్రదేశంలో విడిచిపెట్టాడని తెలిపారు. లవకుశులు ఇక్కడే చదువుకున్నారని, ఈ ప్రదేశం వారి జీవితంలో ఒక ముఖ్యమైన కేంద్రంగా మారిందని తెలిపారు.
భారీ సంఖ్యలో భక్తుల రద్దీ..
నవరాత్రి, ఇతర పండుగల సమయంలో ఈ పవిత్ర స్థలంలో భారీ సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ ప్రత్యేకంగా అఖా తీజ్‌లో పెద్ద ఉత్సవం నిర్వహిస్తారు. ఎందుకంటే లవకుశులు ఈ రోజున జన్మించారని పురాణాలు చెబుతున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. భక్తులు పాల్గొనే తొమ్మిది రోజుల పాటు ఆచారాలు నిర్వహిస్తారు. ఆలయ చారిత్రక ప్రాధాన్యతను తెలుసుకునేందుకు ఇక్కడికి వస్తుంటారని చెబుతారు.