- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శ్రీరామనవమి పండుగ రోజు ఈ పనులు చేస్తే కోరి కష్టాలు తెచ్చుకున్నట్లే .. అవేంటంటే?
దిశ, ఫీచర్స్ : లోక రక్షకుడైన రామయ్య పండుగ శ్రీరామ నవమిని ఘనంగా జరుపుకునేందుకు దేశం సిద్ధమవుతుంది. అయోధ్య రామాలయంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఇతర రామాలయాల్లో కూడా రామ నవమిని ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సీతారాముల కళ్యాణం లోకకళ్యాణం అంటుంటారు. ఈ రోజున రామయ్య కళ్యాణం ఘనంగా జరుపుతారు.
రామ నవమి పండుగ రోజు కొన్ని పనులకు దూరంగా ఉండాలి. ఈ సంవత్సరం శ్రీరామ నవమిని ఏప్రిల్ 17 న జరుపుకోనున్నారు. మహావిష్ణువు అవతారమైన శ్రీరాముడిని పూజించేటప్పుడు, రామ నవమి సమయంలో నివారించాల్సిన పనులు ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం..
ఈ రోజున, శ్రీరాముడిని నిష్టగా పూజించాలి. మాంసాహారాలకు దూరంగా ఉండాలి. మాంసాహారం తింటే రామయ్యకు ఆగ్రహం వస్తుంది. ఫలితంగా ఆర్థిక సమస్యలు వస్తాయి. శ్రీరామ నవమి నాడు మిరపకాయలు, ఉల్లిపాయలు తినడం మానుకోవాలని అంటున్నారు. ఈ పనులు చేయడం వల్ల రాముడిని, శ్రీరామ నవమిని జరుపుకునే వారిని అవమానించినట్టే పండితులు చెబుతున్నారు. ఆహారమే కాకుండా మద్యపానం, ధూమపానానికి కూడా దూరంగా ఉండాలి. శ్రీరామ నవమి రోజున గోళ్లు, వెంట్రుకలు కత్తిరించకండి. ఒకవేళ కత్తిరించుకుంటే రాముడి ఆగ్రహానికి గురై ఆరోగ్యం పాడైపోతుందని అంటున్నారు.