Rakhi : రాఖీ పండుగ వచ్చేస్తుంది.. మీ బ్రదర్స్‌కు ఈ రాఖీలు మాత్రం కట్టకండి!

by Jakkula Samataha |
Rakhi : రాఖీ పండుగ వచ్చేస్తుంది.. మీ బ్రదర్స్‌కు ఈ రాఖీలు మాత్రం కట్టకండి!
X

దిశ, ఫీచర్స్ : రాఖీ పండుగ వచ్చేస్తుంది. అక్క చెల్లెళ్ళు, అన్నా తమ్ముళ్లందరికీ ఈ పండుగ అంటే చాలా ఇష్టం ఉంటుంది. ఇక ఈరోజు అక్క చెల్లెలు రాఖీ కడితే అన్నయ్యలు వారికి గిఫ్ట్స్ ఇస్తుంటారు.ఈ సారి రాఖీ పండుగ ఆగస్టు19న వస్తుంది. అయితే ఈ రాఖీ పండుగ రోజు అక్క చెల్లెలు రాఖీ కట్టే ముందు కొన్ని మిస్టేక్స్ చేయకూడదు అంటున్నారు జ్యోతిష్యులు. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

రాఖీ రంగు అనేది సోదరిపై, సోదరుడిపై శుభ, అశుభ ఫలితాలను చూపిస్తుందంట. అందు వలన మంచి ఫలితాలనిచ్చే రాఖీలు మాత్రమే కట్టాలంట.సోదరీమణులు రాఖీ కొనుగోలు చేసే సమయంలో అస్సలు నలుపు రంగు రాఖీని కొనకూడదంట. ఇది వారికి మంచిది కాదు అంటున్నారు నిపుణులు. అలాగే, ముదురు రంగు రాఖీలు,డ్యామేజీ రాఖీలు అస్సలే బ్రదర్స్‌కు కట్టకూడదంట. అలా కట్టడం అశుభంగా పరిగణిస్తారు జ్యోతిష్య శాస్త్రంలో, అందుకే రాఖీ కట్టే సమయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి మంచివి తీసుకోవాలి. వీలైనంత వరకు పట్టుతో చేసిన రాఖీలు కట్టడం చాలా శుభకరం అంట.

Advertisement

Next Story