హోలీ రోజు ఈ వస్తువులను ఇంటికి తెసుకొస్తే.. మీ ఇంట్లో డబ్బే డబ్బు

by Sumithra |
హోలీ రోజు ఈ వస్తువులను ఇంటికి తెసుకొస్తే.. మీ ఇంట్లో డబ్బే డబ్బు
X

దిశ, ఫీచర్స్ : భారతీయులు ఎంతో సంబరంగా జరుపుకునే పండుగల్లో హోలీ పండుగ ఒకటి. దీపావళి తర్వాత హోలీ పండుగను హిందువుల అత్యంత ప్రత్యేకమైన, అతిపెద్ద పండుగగా చెబుతారు. హోలీ పండుగ ప్రజల్లో ఆనందాన్ని, ఉత్సాహాన్ని, సంతోషాన్ని కలిగిస్తుంది. అలాగే హోలీ నాడు చాలామంది భక్తులు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా పొందుతారు. హోలీనాడు కొన్ని వస్తువులను ఇంటికి తీసుకువస్తే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని త్వరగా పొందొచ్చు అంటున్నారు పండితులు. మరి ఇంతకీ ఆ వస్తువులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజున జరుపుకునే హోలీ పండుగ ఆనందంతో నిండి ఉంటుంది. ఈ పండుగ ప్రతి సంవత్సరం మార్చి నెలలో వస్తుంది. హోలికా పూజ, హోలికా దహన్ తర్వాత ప్రజలు ఆనందంతో రంగులను చల్లుకుంటారు. ఈ ఒక్కరోజు కోసం ఏడాది పొడవునా ఎదురుచూస్తుంటారు. అయితే హోలీరోజున కొన్ని వస్తువులు ఇంటికి తీసుకువస్తే ఇంట్లో ఆనందం, శాంతి కలుగుతుందట. జీవితంలో ఎప్పుడూ డబ్బుకు కొరత ఉండదట.

వెదురు మొక్క..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం హోలికా దహనం రోజున మీరు ఇంట్లోకి వెదురు మొక్కను తీసుకురావచ్చు. హోలీ రోజున ఇంట్లోకి వెదురు మొక్కను తీసుకురావడం శ్రేయస్కరం అని పండితులు చెబుతున్నారు. అలాగే లక్ష్మీ దేవి ప్రసన్నం అవుతుందని చెబుతున్నారు.

వెండి నాణేలు..

దీపావళి రోజున లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి వెండి నాణేన్ని ఇంటికి తెచ్చినట్లే, హోలీ రోజున వెండి నాణేన్ని ఇంటికి తీసుకురావడం శుభప్రదంగా భావిస్తారు. ఇది ఆర్థిక సమస్యలను తొలగిస్తుంది. నాణేన్ని ఎర్రటి గుడ్డలో కొన్ని బియ్యం గింజలతో కట్టి మీ ఇంట్లో భద్రంగా ఉంచండి. ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని నమ్ముతారు.

తాబేలు..

తాబేలు విష్ణువు అవతారంగా చెబుతారు. హోలీ రోజున కుబేర్ యంత్రం లేదా శ్రీ యంత్రం ఉన్న లోహపు తాబేలును ఇంటికి తీసుకవస్తే లక్ష్మీ దేవి సంతోషిస్తుందని నమ్ముతారు. దానివల్ల జీవితంలో ఆనందం, శ్రేయస్సు కలుగుతాయట.

తోరణాలు కట్టడం..

హోలికా దహన్ సమయంలో కాల్చిన చెక్క బూడిదను పవిత్రమైనదిగా భావిస్తారు. ఆ బూడిదను ఇంట్లో చల్లుకోవడం వల్ల నెగటివ్ ఎనర్జీ నశిస్తుందని పండితులు చెబుతున్నారు. హోలీ రోజున ఇంటి ప్రధాన ద్వారం వద్ద మామిడి ఆకులను కడితే లక్ష్మీ దేవిని ప్రసన్నం అవుతుందట. ఇలా చేస్తే జీవితంలో ఆనందం, శాంతి, శ్రేయస్సు కలుగుతుందని చెబుతారు.

Advertisement

Next Story

Most Viewed