కుంభరాశిలోకి అపూర్వ గ్రహ యోగం.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు

by Prasanna |
కుంభరాశిలోకి అపూర్వ గ్రహ యోగం.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు
X

దిశ, ఫీచర్స్: గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటాయి. ఇలా మారినప్పుడు కొన్ని రాశుల వారికి సానుకూలంగాను, మరి కొన్ని రాశుల వారికి ప్రతి కూలంగాను ఉంటుంది.అయితే, శని దేవుడు ప్రస్తుతం తన స్వస్థలమైన కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం బుధుడు కుంభరాశిలోకి ప్రవేశించాడు. దీని ప్రభావం 12 రాశుల వారి పైన ఉంటుంది. వారిలో ఈ రాశుల వారికి మార్చి 6వ తేదీ వరకు శని, బుధ, రవి కలయిక వల్ల లాభాలు పొందనున్నారు. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

మేషరాశి

కుంభరాశిలో శని, సూర్యుడు, రవి కలయిక వల్ల ఏర్పడే యోగం వల్ల ఈ రాశి వారికి ఎంతో మేలు జరుగుతుంది. ఇబ్బందులను అధిగమించడానికి మీకు అవకాశం ఉంది. వ్యాపారంలో డబ్బు సంపాదించే అవకాశం ఉంది. పని చేసే వ్యక్తులు వారి యజమానులు సహోద్యోగుల నుండి మరింత మద్దతు పొందుతారు. ఈ సమయంలో విహారయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. వైవాహిక జీవితం అద్భుతంగ ఉంటుంది.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి రవి, బుధ, శని కలయిక చాలా శుభప్రదమని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. వ్యాపార బాధలు తొలగిపోతాయి. బుధ, సూర్యుని అనుగ్రహంతో విద్యార్థులు చదువుపై ఏకాగ్రత వహించగలరు. పిల్లల గురించి శుభవార్తలు వింటారు. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అదే సమయంలో, ఆర్థిక సమస్యలు నుంచి బయట పడతారు. పెట్టుబడులు పెట్టిన వారికి లాభాలు విపరీతంగా పెరిగిపోతాయి.

Advertisement

Next Story

Most Viewed