- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కన్నుల పండుగగా మహా పడిపూజ.. పోటెత్తిన భక్త జన సందోహం..
దిశ కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం లోని శ్రీ ఆనంద ధర్మశాస్త అయ్యప్ప దేవాలయంలో సోమవారం రాత్రి ఘనంగా అయ్యప్ప మహా పడిపూజ ను నిర్వహించారు. కేరళలోని శబరిమల లో నిర్వహించినట్టు గానే పదునెట్టాంబడి మహాపూజను కేరళ తాంత్రికం తో బ్రహ్మశ్రీ జీవి శాస్త్రి ఈ క్రతువును చేశారు. కాటారం, గారెపల్లి గ్రామాలకు చెందిన భక్త బృందం భజన కీర్తనలు ఆలపించారు. అయ్యప్ప దేవాలయ వ్యవస్థాపకులు బచ్చు లలిత అశోక్ సోమవారం అన్నదానం ఏర్పాటు చేశారు.
కాటారం, మల్హర్, మహదేవ్ పూర్, మహాముత్తారం వివిధ మండలాల నుండి అయ్యప్ప స్వాములు పెద్ద ఎత్తున పడిపూజలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి భాను ప్రసాద్ శర్మ, మాడుగుల నాగరాజ్ శర్మ, కాటారం దేవాలయ పూజారి అనిల్ శాస్త్రి, భక్తజనులు పాల్గొన్నారు.
దేవాలయ అభివృద్ధికి భక్తుల భారీ విరాళం
అయ్యప్ప దేవాలయంలోని మంటపంలో గ్రానైట్ తో పాటు దేవాలయం మొత్తానికి ఆధునిక రీతిలో రంగులు వేయడానికి జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ జక్కు శ్రీ హర్షిని రాకేష్ విరాళం ప్రకటించారు. దేవాలయంలో హుండీ లతో పాటు రక్షణగా గ్రిల్స్, ద్వారాలకు మూడు ఇనుప గేట్లను ఆలయ వ్యవస్థాపకులు బచ్చు అశోక్, దేవాలయానికి పెద్ద ఎత్తున సౌండ్ సిస్టంను ఆలయ అధ్యక్షులు బచ్చు ప్రకాష్, ఆలయ శిల్పి శనిగరం రామ్ రెడ్డి, మహా అన్నదానానికి వంటశాల గది నిర్మాణం, జక్కు మొగిలి స్వామి, ఆలయంలో నాలుగు వైపులా లైట్ల ఏర్పాటుకు పాడి రమేష్, 6 సీసీ కెమెరాలు, దేవతామూర్తుల అభిషేకాలు నిర్వహించేందుకు వెండి జల్లెడను బీరెల్లి అంజయ్య లు, ఇలా భక్తులు తమ తమ విరాళాలను ప్రకటించారు.