- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కల్యాణం కమనీయం.. కానీ, రానీయం!
దిశ, ఖమ్మం: రెండు, మూడు రోజులుగా భద్రాచల శ్రీరాముడి భక్తుల మదిలో నెలకొన్న ఆందోళనే నిజమైంది. శ్రీరామ కల్యాణ వైభోగానికి కరోనా వైరస్ శరాఘాతంలా మారింది. వేలాది మంది సమక్షంలో సీతమ్మ మెడలో తాళికట్టాల్సిన శ్రీరాముడి కేవలం అర్చకులు, వేదపండితుల మధ్య శాస్త్రోక్తమైన వివాహ తంతుతో సరిపెట్టుకోవాల్సి రావడం స్వామివారి భక్తులను బాధిస్తోంది. వైరస్ కట్టడికి తప్పనిసరి పరిస్థితుల్లోనే రామ కల్యాణాన్ని నిరాండబరంగా జరపాలని నిర్ణయించినట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భక్తులెవరూ స్వామివారి కల్యాణాన్ని వీక్షించేందుకు రావొద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది.
వాస్తవానికి రామయ్య కల్యాణాన్ని ఎన్నో ఏండ్లుగా ఆరుబయట..నిర్వహిస్తారు. ఇందుకోసం మిథిలా నగరంగా ప్రత్యేక సెట్ వేసి వేలాదిమంది భక్తులు వీక్షిస్తుండగా వేద పండితులు కల్యాణ తంతును జరిపిస్తారు. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన ఆలయంలో శ్రీరాముడి కల్యాణం, ఆ తర్వాత జరిగే పట్టాభిషేకం మహోత్సవాన్ని వీక్షించేందుకు దేశ, విదేశాల నుంచి కూడా భక్తులు హాజరవుతుంటారు. కానీ ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో చాలామంది భక్తులు నిరాశ చెందుతున్నారు. ఈ నెల 20 నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 2న కల్యాణ మహోత్సవం, ఆ మరునాడు అంటే ఏప్రిల్ 3న శ్రీరామ పట్టాభిషేకం జరిపించేందుకు వేదపండితులు ఇప్పటికే నిర్ణయించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు శ్రీ సీతారాములకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని దేవాదాయశాఖ అధికారులకు, మంత్రి అజయ్‌కు ఖచ్చితమైన సమాచారం ఉండటంతో ఏర్పాట్లను ఘనంగా చేశారు. దాదాపు రూ.2 కోట్లను ప్రభుత్వం ఇందుకు కేటాయించింది.
శ్రీరామ కల్యాణోత్సవ బాధ్యతలను ఈ సారి ప్రభుత్వ సలహాదారు రమణాచారికి అప్పగించారు. రమణాచారి పర్యవేక్షణలో జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు ఏర్పాట్లపై, అభివృద్ధి పనులపై ఆరా తీశారు. కల్యాణోత్సవంలో భాగంగా కొన్ని కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. భక్తులు రామయ్య కల్యాణాన్ని వీక్షించే ఘడియల కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తుండగా.. కరోనా వైరస్ వారి కలలను చెరిపేసింది.
Tags : Sri Rama Kalyanam, Bhadrachalam, Govt orders, Ramachari, Pattabhishekam