అనాథ పిల్లలకు అండగా దేవిశ్రీ ప్రసాద్

by Shyam |
అనాథ పిల్లలకు అండగా దేవిశ్రీ ప్రసాద్
X

దిశ, సినిమా: రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గన్నవరంలోని డాడీస్ హోమ్ అనాథాశ్రమంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. అనాథపిల్లలతో కలిసి కేక్ కట్ చేసిన ఆయన.. ఈ నెలలో ఆశ్రమానికి అవసరమయ్యే నిత్యావసర సరుకులు అందించారు. అనాథలైన చిన్నారులను అక్కున చేర్చుకుని నిస్వార్థ సేవలు అందిస్తున్న డాడీస్ హోమ్‌ను అభినందించిన ఆయన.. నిర్వాహకుల సేవలు తన మనసును తాకాయన్నారు. గతంలో తనను ఇక్కడికి తీసుకొచ్చి సర్‌ప్రైజ్ చేశారని, పిల్లల కోసం మ్యూజిక్ కూడా ప్లే చేశానని చెప్పారు. అప్పటి నుంచి వారితో కనెక్ట్ అయిపోయానన్న దేవి.. ఆశ్రమంలోని కొందరి పిల్లల బాగోగులు చూసుకుంటానని హామీ ఇచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చిన్నారులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. డాడీస్ హోమ్‌కు హెల్ప్ చేయాలనుకుంటే ఫోన్ నం. 9948661346కు కాల్ చేయాలని కోరారు దేవి.

Advertisement

Next Story