‘తాడేపల్లి రాజప్రసాదానికి కనబడుతుందా?’

by srinivas |
‘తాడేపల్లి రాజప్రసాదానికి కనబడుతుందా?’
X

దిశ, వెబ్‌డెస్క్: అమరావతి రాజధాని తరలింపు అంశంపై టీడీపీ నేత దేవినేని ఉమ మరోసారి ట్విట్టర్ వేదికగా జగన్‌ను ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేస్తూ.. రైతులు, రైతు కూలీలు, కదం తొక్కిన మహిళలు 250రోజులుగా రాజధాని మార్పుకు వ్యతిరేకంగా నిరసనలతో వెల్లు వెత్తారని గుర్తు చేశారు.

నిరసనలహోరుతో రాష్ట్రమంతా, వారికి మద్దతుగా దేశ విదేశాల్లో తెలుగువారు మోగించిన రణభేరి తాడేపల్లి రాజప్రసాదానికి కనబడుతుందా? అంటూ దేవినేని ప్రశ్నించారు. న్యాయం అమరావతి రైతుల వైపే ఉందని.. ఇది తెలుసుకోండి జగన్ అంటూ దేవినేని ఉమ ట్వీట్ చేశారు.

Advertisement

Next Story