- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దాడికి కారణమదే -దేవినేని ఉమ
దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సోమవారం దేవినేని ఉమ, అర్జునుడు.. టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిని పరామర్శించారు. ఈ సందర్భంగా దేవినేని ఉమ మీడియాతో మాట్లాడుతూ.. పట్టాభి కారు ధ్వంసం వ్యవహారంలో అధికార పార్టీపై పలు ఆరోపణలు చేశారు.
ప్రభుత్వ అవినీతిని బయటపెడుతున్నారనే పట్టాభి కారుపై దాడి చేశారని ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారన్న ఉక్రోశంతోనే దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. పులివెందుల పంచాయతీలను రాష్ట్రమంతా విస్తరింపజేస్తున్నారని విమర్శించారు. సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్‌కు బీహార్ సంస్కృతిని తీసుకొచ్చారన్నారు.
అమరావతి రైతులను తిట్టడానికి మంత్రికి సిగ్గుండాలని మండిపడ్డారు. రైతులు టీషర్ట్‌లు వేయకూడదా.. విమానాలు ఎక్కకూడదా? అమరావతిని చంపేయాలనే కుట్రతోనే ముంపు ప్రాంతమంటూ డ్రామాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఇంటికి నోటీసులు అంటించి రాజకీయం చేశారని దేవినేని ఉమ పేర్కొన్నారు.