- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మత్స్యకారుడు షాక్.. జగిత్యాలలో ‘దెయ్యపు’ చేపలు
X
దిశ, జగిత్యాల : జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం ఆత్మకూరు గ్రామానికి చెందిన గొల్లపల్లి రాజనర్సు అనే మత్స్యకారునికి అరుదైన చేప లభించింది. ఆత్మకూర్‌కు చెందిన రాజనర్సు స్థానిక చెరువులో చేపలు పడుతుండగా అతని వలకు ఓ వింత చేప చిక్కింది. అది చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు రాజనర్సు. తాను ఎన్నో ఏండ్లుగా చేపలు పడుతున్నానని.. ఇలాంటి చేపను తాను ఎన్నడూ చూడలేదని తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా మత్య్సశాఖ అధికారులకు తెలుపగా దీనిని డెవిల్ (దెయ్యపు) చేప అంటారని, ఇది ఎక్కువగా సముద్రపు జలాల్లో జీవిస్తాయని వెల్లడించారు. తెలంగాణలోని వాగులు, చెరువుల్లో ఇవి దొరకడం చాలా అరుదని వివరించారు. ఎగువన కురిసిన వర్షాలకు కాలువల ద్వారా ఇవి కొట్టుకుని వచ్చి ఉండొచ్చని వారు స్పష్టం చేశారు. ఈ రకం చేపలు తినడానికి పనికి రావని సమాచారం.
Advertisement
Next Story