ఆసుపత్రులలో బెడ్స్ వివరాలు ఆన్లైన్ లో ఉంచాలి: మంత్రి వేముల

by Shyam |
ఆసుపత్రులలో బెడ్స్ వివరాలు ఆన్లైన్ లో ఉంచాలి: మంత్రి వేముల
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : పనిచేస్తున్న సిబ్బంది కోవిడ్ బారిన పడుతున్నప్పటికీ మిగతా సిబ్బంది అందరి బాధ్యతలు నిర్వహిస్తూ ప్రశంసపూర్వక సేవలు అందిస్తున్నారని వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నానని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మన జిల్లా కలెక్టర్, కమిషనర్ ఆఫ్ పోలీస్, మున్సిపల్ కమిషనర్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కోవిడ్ విజృంభన, యంత్రాంగం తీసుకోవాల్సిన చర్యలపై హైదరాబాద్ నుండి సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనాపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ అవసరమైన ఆదేశాలు జారీ చేస్తున్నారన్నారు.

వ్యాక్సినేషన్ కూడా లక్ష్యానికి అనుగుణంగా జరుగుతుందన్నారు. ఈ చికిత్సలకు ప్రభుత్వ ఆసుపత్రులలో 521 బెడ్స్ కి గాను 403 బెడ్స్ భర్తీ అయినాయని మరో 118 ఖాళీగా ఉన్నాయని, అదేవిధంగా ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులు కల్పి 1848 బెడ్స్ కు గాను 1312 భర్తీ అయినాయని మొత్తంగా 536 ఇంకా అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజలకు బెడ్స్ వివరాలు తెలియజేయడానికి ప్రతి నాలుగు గంటలకు ఒకసారి ఆసుపత్రుల వారీగా వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని, ఈ వివరాలను సరి చూడడానికి అధికారులు ఆకస్మిక తనిఖీలు చేయాలని, ఎవరైనా వివరాలను దాచి ఉంచితే ఆ ఆస్పత్రుల లైసెన్సులు రద్దు చేయాలని ఆదేశించారు. రెండు రోజుల్లో ఈ కార్యక్రమం ప్రారంభం కావాలన్నారు.

ఇప్పటికే మాక్లూర్, పెర్కిట్, అందాపూర్ లలో ఏర్పాటుచేసిన ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రాలలో 200 పడకలకు గాను 104 ఖాళీగా ఉన్నాయని ఇంకా మోడల్ స్కూల్స్ కేజీబీవీలో సంక్షేమ గురుకుల పాఠశాలలు 22 లలో మరో 2200 బెడ్స్ ఏర్పాటు చేయడానికి అవకాశం ఉన్నదని అవసరాన్ని బట్టి వాటిని వెంటనే ఉపయోగంలోకి తేవడానికి అన్ని సదుపాయాలు ఉన్నాయని ముందుగా వాటిని అవసరమైతే ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తామని తెలిపారు. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ కోరిన ప్రకారము వెంటిలేటర్ లో ఉండే పేషెంట్లకు ప్రత్యేక మాస్కులు 400 ఖరీదు చేయడానికి 100 ఆక్సిజన్ ఫ్లో మీటర్స్ కొనడానికి ప్రస్తుతమున్న 110 బల్కు సిలిండర్లకు తోడుగా మరో 100 సిలిండర్లు తీసుకోవడానికి 100 చిన్న సిలిండర్లు ఖరీదు చేయడానికి టిఎస్ ఎం డి సి ద్వారా ప్రయత్నం చేస్తానని లేదంటే ఖరీదు చేస్తామని హామీ ఇచ్చారు.

Advertisement

Next Story