బెయిలొచ్చినా జైళ్లోనే లాలూ..

by Shamantha N |
lalu prasad yadav
X

పాట్నా : రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు బెయిలొచ్చినా మరో వారం రోజుల పాటు ఆయన జైళ్లోనే ఉండనున్నారు. దుమ్కా ట్రెజరరీ కేసుతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దాణా కుంభకోణం కేసులో ఆయన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కాగా, దుమ్కా ట్రెజరరీ కేసులో మూడు రోజుల క్రితం లాలూకు బెయిల్ మంజూరైంది. షరతులతో కూడిన బెయిల్‌ను ప్రత్యేక సీబీఐ కోర్టు మంజూరు చేసింది.

కాగా.. బెయిలొచ్చినా లాలూ ఇంటికెళ్లే పరిస్థితులు కనిపించడం లేదు. లాలూ విడుదలకు సంబంధించిన రిలీజ్ ఆర్డర్ ఇంకా సిద్ధం కాలేదు. కొవిడ్ ఉధృతి కారణంగా ఈనెల 19 నుంచి 25 దాకా కోర్టు వాయిదా పడటంతో రిలీజ్ ఆర్డర్స్ మరింత ఆలస్యం కానున్నాయి. అంతేగాక వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న లాలూ.. కొద్దికాలంగా ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. మరో వారం రోజుల పాటు ఆయనకు చికిత్స అందనుంది. రిలీజ్ ఆర్డర్స్ వచ్చిన అనంతరమే ఆయన జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Next Story

Most Viewed