- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాబరీ గ్యాంగ్‌కు సపోర్ట్ చేసిన ముంబై పోలీసులు
దిశ, ఫీచర్స్ : మనీ హీస్ట్ సీజన్-5 శుక్రవారం, సెప్టెంబర్ 3న విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే నాలుగు సీజన్లు సూపర్ డూపర్ హిట్ కాగా, ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఐదో సీజన్ కోసం ఎప్పటి నుంచో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ది లాస్ట్ సీజన్ విడుదల రోజున డై హార్డ్ ఫ్యాన్స్ నానా హంగామా చేశారు. ఈ మేరకు జైపూర్‌కు చెందిన ఐటీ కంపెనీ తమ ఉద్యోగులకు ‘మనీ హీస్ట్ చిల్‌డే’ అంటూ హాలీడే ప్రకటించగా, ఇక ముంబై పోలీసులు తమ ‘బ్యాండ్ ఖాకీ స్టూడియో’ ట్విట్టర్ అకౌంట్‌లో ‘బెల్లా సియావో పాట’ను ప్రదర్శిస్తున్న వీడియోను షేర్ చేసి, తమ ఫ్యాన్ మూమెంట్ పంచుకున్నారు.
పోలీసులు ‘దొంగల’ను పట్టుకోవడం కామన్ అయితే ‘మనీ హీస్ట్’ రాబరీ గ్యాంగ్‌కు మాత్రం సపోర్ట్‌గా నిలవడం విశేషం. బ్యాంకు దోపిడీకి పాల్పడే వ్యక్తులను వదలబోమంటూ రియల్ లైఫ్‌లో ప్రతిజ్ఞ చేసినా పోలీసులు, బ్యాంక్ ర్యాబరీ నేపథ్యంలో వచ్చిన హిట్ సిరీస్ మనీహీస్ట్‌తో పాటు దాని థీమ్ సాంగ్‌ని కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మనీహీస్ట్ సీజన్ 5 విడుదల రోజు సంగీతంతో సెలబ్రేట్ చేసుకున్నారు. బెల్లా సియావో పాటను తమ ట్రూప్‌తో కలిసి ప్లే చేసిన ముంబై పోలీసులు, దానికి సంబంధించిన వీడియోను తమ ట్విట్టర్ అకౌంట్ ‘ఖాకీ స్టూడియో’లో షేర్ చేశారు. నెటిజన్లు ఖాకీల టాలెంట్‌పై ప్రశంసలు కురిపిస్తుండగా, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ కూడా, వారిని అభినందిస్తూ కామెంట్ చేసింది.
ముంబై పోలీసులు తమ మ్యూజిక్ బ్యాండ్‌తో ఇదివరకే యావత్ భారతీయుల మనసు దోచుకున్నారు. ఇక ఇటీవలే జేమ్స్ బాండ్ థీమ్ మ్యూజిక్ ప్రదర్శించి దాన్ని ‘ఖాకీ స్టూడియో’లో పంచుకోగా, వారిపై ప్రశంసల వర్షం కురిపించారు నెటిజన్లు.