- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వారలా… వీరిలా…
దిశ ప్రతినిధి, కరీంనగర్: వారసత్వంగా రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆ వారసులు వైవిద్యంగా ముందుకు సాగుతున్నారు. పొలిటికల్ సీనారియోలో కనిపిస్తున్న డిపెండెంట్స్ వారి తండ్రుల అడుగు జాడల్లో మాత్రం నడవలేకపోతున్నారు. దశాబ్దాలుగా అనుబధం పెనవేసుకున్న పార్టీలోనే తండ్రులు తమ వారసులను చేర్పించినా చాలా మంది మాత్రం వేరే పార్టీల వైపే మొగ్గు చూపుతున్నారు. తమవారి ఆశయాలకు అనుగుణంగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన వారసులు పార్టీల్లోకి ఫిరాయిస్తుండడం చర్చనీయాంశంగా మారింది.
పీవీ తనయ వాణీదేవి..
స్వాతంత్రద్యోమ కాలం నుంచి కాంగ్రెస్ పార్టీతోనే అనుభందం పెనవేసుకున్న పివి నరసింహరావు చివరి వరకు అదే పార్టీలో కొనసాగారు. ప్రధాని పదవి కాలం ముగిసిన తర్వాత జాతీయ రాజకీయాల్లో ఆయనని ఒంటరిని చేసినా కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయలేదు. జాతీయ నాయకులంతా ఏకమైనా పివి మాత్రం తనలోని ఆలోచనా విధానాలను మార్చుకోలేదు. ఆయన తనయులు పివి రంగారావు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా చట్టసభల్లోకి అడుగు పెట్టగా మరో కుమారుడు పివి రాజేశ్వర్ రావు లోకసభకు ప్రాతినిథ్యం వహించారు. వీరిద్దరూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులుగానే వ్యవహరించారు. పివి గ్రాఫ్ పడిపోయిన తరువాత రాజకీయాల్లోనే ఆ కుటుంబానికి ప్రాధాన్యత లేకుండా పోయింది. అయితే తాజాగా జరుగుతున్న గ్రాడ్యూయేట్స్ కానిస్టెన్సీ నుండి ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ అభ్యర్థిగా పివి తనయ వాణీ దేవి పోటీ చేశారు. తండ్రి క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నప్పుడు కూడా ప్రత్యక్ష్య రాజకీయాలకు అందనంత దూరంలో ఉన్న వాణీ దేవి అనూహ్యంగా టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు.
కాక తనయుడు…
కాంగ్రెస్ పార్టీ ఉద్దండుల్లో ఒకరైన జి. వెంకటస్వామి అలియాస్ కాకా కూడా చివరి వరకు అదే పార్టీలో కొనసాగారు. ఆయన వారసత్వంతో ప్రత్యక్ష్య రాజకీయాల్లోకి వచ్చిన జి. వివేకానంద (వివేక్) మాత్రం స్థిమితంగా ఒకే పార్టీలో ఉండలేకపోతున్నారు. 2019లో పెద్దపల్లి ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెల్చిన వివేక్ తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ లో చేరారు. 2014 ఎన్నికలకు ముందు తిరిగి కాంగ్రెస్ లో చేరి పెద్దపల్లి నుంచి ఓటమి చవి చూశారు. ఎన్నికల తరువాత తిరిగి టీఆర్ఎస్ లో చేరిన వివేక్ 2018 ఎన్నికలప్పుడు మళ్లీ పార్టీని వీడారు.
ఇప్పుడు బీజేపీలో క్రియాశీలక నాయకునిగా ఎదిగిన వివేక్ వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.ఆయన అన్న వినోద్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఓ సారి ఎమ్మెల్యే అయి మంత్రిగా కూడా పని చేశారు. గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు బీఎస్పీలో చేరిన వినోద్ తిరిగి సొంతగూటికే చేరారు. రాష్ట్ర మంత్రిగా పనిచేసిన జువ్వాడి రత్నాకర్ రావు తనయులు కాంగ్రెస్ పార్టీలో చేరి కొంతకాలంలో టీఆర్ఎస్ తో అనుభందం పెంచుకుని తిరిగి సొంతపార్టీలో తమ హస్తవాసిని పరీక్షించుకుంటున్నారు. రాష్ట్ర మంత్రిగా పని చేసిన పాటి రాజం బార్య శకుంతల కూడా ప్రస్తుతం టీఆర్ఎస్ లో కొనసాగతున్నారు.