డేరా బాబాకు పెరోల్..

by Sumithra |   ( Updated:2021-05-21 07:07:17.0  )
డేరా బాబాకు పెరోల్..
X

చండీగఢ్: డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌ అనారోగ్యానికి గురైన తన తల్లిని కలవడానికి పెరోల్ లభించింది. ఇద్దరు మహిళా అనుచరులపై అత్యాచారం(2017 ఆగస్టులో దోషిత్వం), జర్నలిస్టు రామచందర్ ఛత్రపతి హత్యా కేసుల్లో డేరా బాబా 20ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నారు. తన తల్లి అనారోగ్యంగా ఉన్నదని, ఆమెను చూడటానికి పెరోల్ ఇవ్వాల్సిందిగా బాబా ఈ నెల 17న దరఖాస్తు పెట్టుకోగా రాష్ట్ర పోలీసులు ఆమోదించారు. రోహతక్‌లోని సునరియా జైలు నుంచి ఆయనను గట్టి భద్రత నడుమ శుక్రవారం ఉదయం గురుగ్రామ్‌లోని తల్లి దగ్గరకు తీసుకెళ్లారు. ఆయన అనుచరులు ఆటంకాలు కలిగించే ముప్పును దృష్టిలో పెట్టుకుని పోలీసులు డేరా బాబా లొకేషన్ వివరాలు వెల్లడించలేదు.

బీపీ పడిపోయిందన్న కారణంతో ఇటీవలే డేరా బాబాను రోహతక్‌లోని పీజీ ఇన్‌స్ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ను చేర్చగా మరునాడే డిశ్చార్జ్ అయ్యారు. దీనిపై బాధిత జర్నలిస్టు రామచందర్ ఛత్రపతి కుమారుడు స్పందిస్తూ, రాష్ట్ర ప్రభుత్వానికి, ఆయనకు మధ్య లోపాయికారి సంబంధమున్నట్టు తెలుస్తు్న్నదని ఆరోపించారు. హాస్పిటల్ వంక చెప్పగానే బయటకు వెళ్లడానికి అనుమతిచ్చారని, వైద్యుల నుంచి అనుకున్నట్టు రిపోర్టుల రాలేదు. దీంతో ఆయన మళ్లీ పెరోల్ కోసం దరఖాస్తు చేయడం, పోలీసులు అనుమతి త్వరతగతిన రావటాన్ని అర్థం చేసుకోవాలని అన్నారు. ఆయనకు రెండు రోజుల పెరోల్ ఇచ్చినట్టు తెలిసిందని వివరించారు.

Advertisement

Next Story

Most Viewed