డేరా బాబాకు కరోనా.. ఆసుపత్రికి తరలింపు

by Anukaran |   ( Updated:2021-06-06 07:07:24.0  )
డేరా బాబాకు కరోనా.. ఆసుపత్రికి తరలింపు
X

దిశ, వెబ్‌డెస్క్: వివాదస్పద గురువు డేరా బాబా కరోనా బారిన పడ్డారు. డేరాబాబాగా ప్రసిద్ధి చెందిన డేరా సచ్చా సౌదా అధినేత గుర్మీత్‌ రామ్‌ కు ఆదివారం కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ అని తేలింది. తన ఆశ్రమంలోని ఇద్దరు సాద్విల‌పై డేరా బాబా అత్యాచారానికి పాల్పడినట్టు తేలడంతో సీబీఐ కోర్టు ఆయనకు 20 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పు చెప్పిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆయన హర్యానాలోని రోహ్‌తక్‌లోని సునేరియా జైల్లో శిక్షను అనుభవిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బాబా మూడు రోజుల నుండి విపరీతమైన కడుపునొప్పితో బాధపడుతున్నట్లు గుర్తించిన అధికారులు ఆయనను పీజీఐఎంఎస్‌ ఆసుపత్రికి తరలించి సిటీస్కాన్‌ పరీక్షలు చేయించారు. వీటితో పాటు కరోనా పరీక్షలు కూడా చేయించడంతో అందులో పాజిటివ్ అని నిర్దారణ అయ్యింది. దీంతో ఆయనను చికిత్స నిమిత్తం గురుగ్రామ్‌లోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Next Story