అభివృద్ధి పనులపై డిప్యూటీ స్పీకర్ సమీక్ష

by Shyam |
అభివృద్ధి పనులపై డిప్యూటీ స్పీకర్ సమీక్ష
X

దిశ, సికింద్రాబాద్: శాసనసభ ఉప సభాపతి పద్మారావు సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజవర్గ అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. లాలాపేట స్విమ్మింగ్ పూల్, ఫంక్లన్ హాల్ నిర్మాణం, తుకారాం గేటు ఆర్‌యూబీ రోడ్డు విస్తరణ పనులపై అధికారులతో చర్చించారు. సాయినగర్, సుభాష్ చంద్రబోస్ నగర్, ఏసీఎస్‌ నగర్‌లో చేపడుతున్న డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాల‌పై ఆరా తీశారు. సమావేశంలో జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, సికింద్రాబాద్ ఆర్‌డీవో వసంత కుమారి, డిప్యూటీ కమిషనర్ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story