విజయనగరంలో ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం సమీక్ష

by srinivas |
విజయనగరంలో ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం సమీక్ష
X

కరోనాపై విజయనగరం జిల్లా ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వివరించి, జిల్లాపై కరోనా ప్రభావం తదితర వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, ప్రజలంతా అధికారులకి, వైద్య సిబ్బందికి సహకరించాలని పిలుపునిచ్చారు. ముందు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని నిరోధించవచ్చని ఆమె సూచించారు.

లాక్ డౌన్ తో ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజ్ ని ప్రకటించిందని ఆమె తెలిపారు. రాష్ట్రంలోని తెల్ల రేషన్ కార్డు హోల్డర్లకు రేషన్‌తో పాటు ఆర్దిక సహాయం కూడా చేస్తున్నామని అన్నారు. వలంటీర్ల సాయంతో విదేశాల నుండి వచ్చిన వారిని గుర్తించి, వారిని కేవలం ఇంటికి మాత్రమే పరిమితమయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని ఆమె చెప్పారు.

అంగన్వాడీల ద్వారా బాలింతలు, చంటి బిడ్డల రేషన్ సైతం ఇంటికే అందజేసేలా చర్యలు చేపట్టామని అన్నారు. రేపటి నుంచి ఇచ్చే రేషన్ టైంస్లాట్ పెట్టి రద్దీ ఏర్పడకుండా పంపిణీ చేయనున్నామని ఆమె తెలిపారు.

Tags : andhra pradesh, deputy cm, pushpa srivani,

Advertisement

Next Story