సగం ఆస్పత్రుల్లో ఆక్సిజన్ లేదు.. వైద్యారోగ్యశాఖ అప్రమత్తం

by Shyam |   ( Updated:2021-09-22 10:40:36.0  )
సగం ఆస్పత్రుల్లో ఆక్సిజన్ లేదు..  వైద్యారోగ్యశాఖ అప్రమత్తం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం చెబుతున్నట్లు ప్రస్తుతానికి అన్ని పడకలకు ఆక్సిజన్​సదుపాయం కల్పించలేదు. వైద్య, విద్య, వైద్యవిధాన పరిషత్​ పరిధిలోని 130 హాస్పిటల్స్ లో కేవలం సగం బెడ్లకు మాత్రమే ఆక్సిజన్​ సౌకర్యం ఉన్నట్లు ఆధికారుల రికార్డులు చెబుతున్నాయి. ఈ రెండు విభాగాల హస్పిటల్స్​ లో 27,141 బెడ్లు ఉండగా, ప్రస్తుతం కేవలం 10,224కు మాత్రమే ఆక్సిజన్​ సౌకర్యం ఉన్నది. మరో 16,917 బెడ్లకు కూడా ఆక్సిజన్​ గా మార్చాలని నిర్ణయం తీసుకోగా, ఆరు వేల బెడ్లకు ఆక్సిజన్​ను ఏర్పాటు చేసే ప్రక్రియ కొనసాగుతున్నట్టు వైద్యాధికారులు వివరిస్తున్నారు. వేగంగా ఏర్పాటు చేయాలని ఇటీవల సీఎం కేసీఆర్​ చెప్పినా.. అధికారుల నిర్లక్ష్యంతో పనులు నత్తనడకన జరుతున్నాయి.

దీంతో పాటు థర్ద్​ వేవ్​ లో చిన్నారులు ఇన్​ ఫెక్ట్​ అయ్యే ఛాన్స్​ ఉందని కొవిడ్​ కమిటీ సభ్యుల అభిప్రాయాలతో ప్రత్యేక పీడియాట్రిక్​ వార్డులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. సుమారు 6 వేల బెడ్లను పిల్లలకు చికిత్సను అందించేందుకు సిద్ధం చేశామన్నారు. వీటిలో 1875 ఐసీయూ బెడ్లకు హెచ్​ఎఫ్​ఎన్​ సీ, సికాప్​బీ పాప్​ మానిటర్స్​ ను ఏర్పాటు చేశామన్నారు. ఇక నిలోఫర్​ లో 2000 బెడ్లలో 500 ఐసీయూ, 1500 బెడ్లకు ఆక్సిజన్​ను కల్పించామన్నారు. ఒక వేళ పేషెంట్ల సంఖ్య పెరిగితే నిలోఫర్​ లో అదనపు బెడ్లను కూడా ఏర్పాటు చేసుకునేందుకు అన్ని సౌకర్యాలను అందుబాటులో ఉంచినట్లు ఆఫీసర్లు పేర్కొన్నారు. దీంతో పాటు జిల్లాల్లోనూ పీడియాట్రిక్​ బెడ్లను అందుబాటులో ఉంచినట్లు వైద్యాధికారులు స్పష్టం చేశారు.

Advertisement

Next Story