మాంసం దుకాణాల్లో తనిఖీలు

by Shyam |   ( Updated:2020-04-29 08:39:20.0  )
మాంసం దుకాణాల్లో తనిఖీలు
X

దిశ, న్యూస్ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మటన్ దుఖాణాలపై పశుసంవర్థక శాఖ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. కొవిడ్ 19 కట్టడికి విధించిన లాక్‌డౌన్ నేపథ్యంలో మాంసం విక్రయదారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ, అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఫిర్యాదులు రావడంతో జీహెచ్ఎంసీ కార్యచరణలోకి దిగింది.

డాక్టర్ బాబుబేరి, ఖాద్రి, డాక్టర్ సింహారావు, సుభాష్, నిజాంలతో కూడిన ఐదుగురు పశుసంవర్థక శాఖ అధికారుల బృందం బుధవారం కూకట్‌పల్లి, జేఎన్టీయూ, ప్రగతినగర్, బాల నగర్, ముషీరాబాద్ తదితర ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించింది. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఒక దుకాణాన్ని సీజ్ చేశారు. మటన్ కిలో రూ.700కు మించి విక్రయించొద్దనీ, అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ధరలు తెలిపేలా డిస్ ప్లే బోర్డులను షాపుల‌లో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పరిశుభ్రత పాటించాలనీ, దుకాణాలకు వచ్చే వారు కనీస దూరం పాటించే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Tags: meat shops, greater hyderabad, Department of Animal Husbandry, checks, covid 19

Advertisement

Next Story

Most Viewed