నెక్కొండలో డీఈఓ ఆకస్మిక తనిఖీలు.. టీచర్లు లేకపోవడంతో..!

by  |
నెక్కొండలో డీఈఓ ఆకస్మిక తనిఖీలు.. టీచర్లు లేకపోవడంతో..!
X

దిశ, నెక్కొండ: నెక్కొండ మండలం ధూద్య తండా, బడి తండా, అజ్మీరా మంగ్యా నాయక్ తండా, సూర్య తండా పాఠశాలల్లో వరంగల్ డీఈఓ వాసంతి గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఉపాధ్యాయుల హాజరు పట్టికలతో పాటు ఉపాధ్యాయుల గైర్హాజరు పై విద్యార్థులతో మాట్లాడి ఆరా తీశారు. ఈ క్రమంలో బడి తండా, అజ్మీరా మంగ్యా తండా పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఎలాంటి సెలవు పత్రాలు లేకుండా ఎవరి అనుమతి తీసుకోకుండా గైర్హాజరు అవ్వడాన్ని డీఈఓ వాసంతి తనిఖీలో గుర్తించారు.

అనంతరం దిశ ప్రతినిధితో ఆమె మాట్లాడుతూ.. నెక్కొండ మండలంలో పాఠశాలల ఉపాధ్యాయులు గైర్హాజరును అరికట్టేందుకు గాను పాఠశాలల తనిఖీ నిర్వహించినట్లు తెలిపారు. మండలంలో ఉపాధ్యాయుల గైర్హాజరు లేకుండా ఉండేందుకు సంబంధిత కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు నెలకు 2 విడతలుగా తనిఖీ నిర్వహించాలన్నారు. కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు మారుమూల ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలో పర్యవేక్షణ పెంచాలన్నారు. లేనియెడల వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బడి తండా, అజ్మీరా మంగ్యా తాండల్లోని ఉపాధ్యాయుల గైర్హాజరు పై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

Next Story

Most Viewed