- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పాఠశాల భేష్.. విద్యాబోధన అదుర్స్.. అభినందించిన డీఈఓ
దిశ, కొత్తగూడ : కొత్తగూడ మండలంలోని ప్రాథమికోన్నత పాఠశాలను డీఈఓ సోమశేఖర్ శర్మ ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలలోని అన్ని రికార్డులను పరిశీలించారు. అనంతరం తరగతి గదుల శానిటైజేషన్, పాఠశాల ఆవరణలోని పరిశుభ్రత, టాయిలెట్లను పరిశీలించారు. ఉపాధ్యాయుల హాజరు శాతం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి బోధన విధానం, సౌకర్యాలు గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాలలో అందరూ సామాజిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని సూచించారు. విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విద్యార్థులు మాస్క్‌లు, శానిటైజర్ తప్పనిసరిగా ఉపయోగించాలన్నారు. పాఠశాలలో విద్యాబోధన చూసి ఉపాధ్యాయుల బృందాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఎంవో శ్రీ రాములు, ఎంఈవో శ్రీ దేవి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజశేఖర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.