- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం కేసీఆర్‌కు డెంటల్ సైన్స్ విద్యార్థిని లేఖ.. మీరు దయతలిస్తే..!
దిశ, అచ్చంపేట : నల్లమల ప్రాంతంలోని నాగర్ కర్నూల్ జిల్లా పదర మండలం మారుమూల ప్రాంతం వంకేశ్వరం గ్రామానికి చెందిన బి. ప్రగతి తండ్రి వెంకటయ్య అను నేను డెంటల్ సైన్స్ విద్యాభ్యాసం చేస్తున్నాను. మా కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగా లేనందున ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాము. కావున, కేసీఆర్ గారు నా యందు దయతలచి చదువుకునేందుకు ఆర్థిక సాయం అందజేయాలని విన్నవించుకుంటున్నాను.. అంటూ ముఖ్యమంత్రికి సామాజిక మాధ్యమాల ద్వారా లేఖ రాసింది.
ఆమె మాటల్లోనే.. మాది నిరుపేద కుటుంబం నాన్న సామాజిక కార్యకర్త. అమ్మ (అనిత ) ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెంది వ్యవసాయ కూలీగా పనిచేస్తోంది. మేము ఇద్దరం ఆడపిల్లలం. తాను చిన్నప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాను. నాకు 10వ తరగతిలో 510 మార్కుల రావడంతో ఉమ్మడి నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలంలో రెండవ స్థానంలో నిలిచాను. గొప్ప డాక్టర్ కావాలనే దృఢనిశ్చయంతో ఇంటర్మీడియట్‌లో BIPC ఇంగ్లీష్ మీడియం తీసుకుని 922 మార్కులతో ఉత్తీర్ణత సాధించాను. తరువాత సమయంలో అతిక్లిష్టమైన పరిస్థితిలో నీట్ – పరీక్ష రాసి A కేటగిరిలో కామినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్స్ నల్గొండ జిల్లాలోని నార్కెట్ పల్లి బ్రాంచ్లో సీటు సాధించి విద్యాభ్యాసం చేస్తున్నాను.
కానీ హాస్టల్, కాలేజీ ఫీజు కలిపి మొత్తం సంవత్సరానికి రూ. 2 లక్షలకు పైగా ఖర్చు అవుతోంది. ఇలా 4 సంవత్సరాలకు రూ. 8 లక్షలకు పైగా ఖర్చు అవుతోంది. గొప్పగా చదవాలనే సంకల్పం ఇన్నిరోజులుగా నన్ను ముందుకు నడిపింది. ఇప్పుడు అంత డబ్బులు కట్టలేని స్థితిలో మా తల్లిదండ్రులు ఉన్నారు. కరోనా సమయంలో పనులులేక మా పేరెంట్స్ అప్పులు చేసి మొదటి సంవత్సరం ఫీజు కట్టారు. మా నాన్న సామాజిక కార్యకర్తగా బాలల విద్యాభ్యాసం, బాల్యవివాహాల నిర్మూలన కోసం పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ప్రస్తుతం మేము పై చదువుల కోసమని అమ్రాబాద్ మండల కేంద్రంలో అద్దె ఇంట్లో ఉంటున్నాము. ఇప్పుడు నా తల్లిదండ్రులు కాలేజీ ఫీజు చెల్లించలేని స్థితిలో ఉన్నారు. కావున, దయచేసి నాలాంటి పేద విద్యార్థికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించి.. తన చదువు కొనసాగేలా సహకారం అందిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.
కృతజ్ఞలతో..
బియ్యని ప్రగతి, తండ్రి వెంకటయ్య,
సెల్ : 99121 08351.