- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డెన్మార్క్‌లో ఆర్టిఫిషియల్ ఎనర్జీ ఐలాండ్
దిశ, ఫీచర్స్: అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్న ‘నార్త్ సీ’.. గ్రేట్ బ్రిటన్, డెన్మార్క్, నార్వే, జర్మనీ, నెదర్లాండ్స్, బెల్జియం, ఫ్రాన్స్ మధ్య విస్తరించి ఉంది. కాగా ఈ సముద్ర ప్రాంతంలో ఓ కృత్రిమ ద్వీపాన్ని నిర్మించి, గ్రీన్ ఎనర్జీ అందించేందుకు డానిష్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించిన ప్రణాళికను ఇటీవలే ఆమోదించగా, డెన్మార్క్ చరిత్రలోనే 210 బిలియన్ డాలర్ల వ్యయంతో చేపట్టబోయే అతిపెద్ద నిర్మాణ ప్రాజెక్టుగా ఇది చరిత్రలో నిలిచిపోనుంది. ఇంతకీ డెన్మార్క్ ఆర్టిఫిషియల్ ఎనర్జీ ఐలాండ్ ప్రాజెక్ట్ విశేషాలేంటో తెలుసుకుందాం.
సూర్యరశ్మి, గాలి, నీరు వంటి సహజ వనరులను ఉపయోగించి ఉత్పత్తి చేసే విద్యుత్ శక్తిని ‘గ్రీన్ ఎనర్జీ’గా పిలుస్తారన్నది తెలిసిందే. ఈ రకంగా ఉత్పత్తయ్యే శక్తి వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని ఉండకపోవడంతో దీన్ని ‘గ్రీన్ ఎనర్జీ’గా పిలుస్తున్నారు. ఇక ప్రస్తుతం డెన్మార్క్ నిర్మించ తలపెట్టిన ‘ఆర్టిఫిషియల్ ఎనర్జీ ఐలాండ్’ కూడా ‘గ్రీన్ ఎనర్జీ’ ప్రాజెక్టే కావడం విశేషం. సాధారణంగా ఇందుకోసం సముద్రంలో విండ్ ఫార్మ్స్ నిర్మించి, సముద్రపు తీరం నుంచి వచ్చే గాలుల(సముద్రం నుంచి భూమి వైపు వీచేది ఆన్‌షోర్ విండ్ కాగా, ఆఫ్‌షోర్ విండ్ అంటే భూమి నుంచి సముద్రం వైపు వీచే గాలి. గాలులు సాధారణంగా వాతావరణంలో, ఒత్తిడిలో తేడాల వల్ల సంభవిస్తాయి)తో విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం.
ఈ ప్రాజెక్ట్ ద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్‌ను డెన్మార్క్, దాని పొరుగు దేశాలతో పంచుకోనుండగా, ఇందుకోసం ఇప్పటికే నెదర్లాండ్స్, జర్మనీ, బెల్జియంతో ఒప్పందాలు సైతం కుదుర్చుకుంది. రెండు ఎనర్జీ ఐలాండ్స్ నిర్మాణాన్ని ప్రారంభించాలని డానిష్ పార్లమెంట్ గతేడాది జూన్‌లోనే నిర్ణయం తీసుకుంది. కాగా ఈ ద్వీపాలలో ఒకటి ఉత్తర సముద్రంలో నిర్మిస్తుండగా, రెండో ద్వీపాన్ని బాల్టిక్ సముద్రంలోని బోర్న్‌హామ్ ద్వీపంలో నిర్మించనున్నారు. 2050 నాటికి రెనెవబుల్ ఎనర్జీ (పునరుత్పాదకత శక్తి) మీదే ఎక్కువ ఆధారపడటంతో పాటు ఆఫ్‌షోర్ పవన శక్తి సామర్థ్యాన్ని 25 రెట్లు పెంచడానికి తన విద్యుత్ వ్యవస్థను మార్చే యోచనలో యూరోపియన్ యూనియన్ తీర్మానం చేయడంతో.. డెన్మార్, దాని పొరుగు దేశాలు ఈ ప్రాజెక్ట్‌ను తెరమీదకు తీసుకొచ్చాయి. గురువారం ‘ఆర్టిఫిషియల్ ఎనర్జీ ఐలాండ్’ ప్రాజెక్ట్ డానిష్ పార్లమెంట్ ఆమోదం పొందింది.
ఇది ఉత్తర సముద్రంలోకి 80 కిలోమీటర్ల దూరంలో ఉండగా, దానిలో ఎక్కువ భాగం డానిష్ ప్రభుత్వానికి చెందింది. ఆఫ్‌షోర్ పవన శక్తిని అధిక మొత్తంలో అందించడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం కాగా, యూరోపియన్ యూనియన్ (ఈయు)లోని 3 మిలియన్లకు పైగా గృహాల విద్యుత్ అవసరాలను తీర్చడానికి కావలసినంత గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయగలదని అధికారులు అంచనా వేస్తున్నారు. డానిష్ ఎనర్జీ ఏజెన్సీ ప్రకారం ఇంధన, పరిశ్రమల కోసం వాతావరణ ఒప్పందంలో భాగంగా ఇటువంటి ఎనర్జీ ఐలాండ్ నిర్మిస్తున్న తొలి దేశంగా డెన్మార్క్ నిలవాలనుకుంటుండగా, రెండు ద్వీపాల నిర్మాణం 2030 నాటికి పూర్తవుతుందని అధికారులు భావిస్తున్నారు.