- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్రంలో డెంగీ ఔట్ బ్రేక్.. అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్న మంత్రి
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా డెంగీ కేసులు భారీగా నమోదవుతున్నాయని స్వయంగా మంత్రి హరీష్ రావు అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సోమవారం క్వశ్చన్ అవర్‌లో డెంగీ పరిస్థితులపై ప్రశ్నలు లేవనెత్తారు. దీనికి మంత్రి సమాధానం ఇస్తూ ఇప్పటి వరకు సుమారు 4 వేల డెంగీ కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు.అంటే 2019 లో జరిగిన ఔట్ బ్రేక్ కు దగ్గర్లో ఉన్నామన్నారు. కానీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో నివారణ చర్యలు తీసుకుంటుందని మంత్రి చెప్పారు.
కేసులు ఎలా పెరుగుతున్నాయి..?
ప్రభుత్వం చర్యలు తీసుకుంటే కేసులు భారీగా ఎలా వస్తున్నాయని, అక్బరుద్దీన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. పాతబస్తీలో నోరు తెరిస్తే దోమలు లోపలికి వెళ్తున్నాయని మండిపడ్డారు. అంతేకాకుండా ప్రైవేట్ ఆసుపత్రిలో డెంగీ దోపిడి విపరీతంగా ఉందన్నారు. దీనిపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. దీనితో పాటు వైరల్ జ్వరాలపై కూడా దృష్టి సారించాలని కోరారు.