అలర్ట్.. జీహెచ్ఎంసీలో పెరుగుతున్న డెంగ్యూ కేసులు

by Shyam |   ( Updated:2021-08-20 08:30:21.0  )
అలర్ట్.. జీహెచ్ఎంసీలో పెరుగుతున్న డెంగ్యూ కేసులు
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో గ‌త వారం రోజులుగా డెంగ్యూ కేసుల సంఖ్య గ‌ణ‌నీయంగా పెరిగింద‌ని లక్డీకాపుల్ గ్లెనీగ‌ల్స్ గ్లోబ‌ల్ ఆసుప‌త్రి వైద్యులు తెలిపారు. దోమ‌కాటు వ‌ల్ల డెంగ్యూ వ‌స్తుందని. ఒక్కోసారి దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉండి, చివ‌ర‌కు మ‌ర‌ణం కూడా సంభ‌విస్తుందని, కొన్ని సాధార‌ణ జాగ్రత్తలు తీసుకుంటే డెంగ్యూ కార‌క దోమ‌ల నుంచి ప్రజ‌లు ర‌క్షణపొంద‌వ‌చ్చని వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం గ్లెనీగ‌ల్స్ గ్లోబ‌ల్ ఆసుప‌త్రి క‌న్సల్టెంట్ ఇంట‌ర్నల్ మెడిసిన్ నిపుణులు డాక్టర్ వై. ప్రశాంత్ చంద్ర మాట్లాడుతూ.. వ‌ర్షాకాలంలో పారిశుధ్యం స‌రిగా లేక‌పోవ‌డం వ‌ల్ల న‌గ‌రంలో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయని అన్నారు.

గత వారం రోజులుగా క‌నీసం 40 నుండి 50 శాతం ఈ వ్యాధులు పెరిగాయని చెప్పారు. సాయంత్రం సమయంలో తెల్లవారుజామున డెంగ్యూ కార‌క దోమ‌లు బాగా చురుగ్గా ఉంటాయని, ఈ స‌మ‌యంలో వాకింగ్ కోసం వెళ్లేవారు జాగ్రత్తలు తీసుకోవాలని, పారిశుద్ధ్య ప‌రిస్థితులు స‌రిగా లేనిచోట ఉంటే వీటి కాటుకు గుర‌వుతారని అన్నారు. దీనిని నివారించేందుకు శ‌రీరాన్ని పూర్తిగా క‌ప్పి ఉంచే దుస్తులు ధ‌రించ‌డం, ప‌రిస‌రాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచుకోవ‌డం, నీళ్లు నిల్వ ఉన్నచోట న‌డ‌వ‌కుండా ఉండ‌టం లాంటి చ‌ర్యల‌తో డెంగ్యూను నివారించ‌వ‌చ్చని చెప్పారు. జ్వరం వ‌చ్చిన‌వాళ్లు త‌ప్పనిస‌రిగా ప‌రీక్ష చేయించుకుని ముప్పును అంచ‌నా వేసుకోవ‌డం చాలా ముఖ్యమని అని డాక్టర్ ప్రశాంత్ చంద్ర వివ‌రించారు.

Advertisement

Next Story

Most Viewed