ఎమ్మెల్యే ధర్మారెడ్డి రాజీనామాకు డిమాండ్

by Ramesh Goud |   ( Updated:2021-08-05 06:22:20.0  )
ఎమ్మెల్యే ధర్మారెడ్డి రాజీనామాకు డిమాండ్
X

దిశ, పరకాల: దళిత ద్రోహి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి రాజీనామా చేయాలని యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఇటీవల కాలంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి దళితులను అనుచిత వ్యాఖ్యలతో అవమానించిన పరిస్థితి ఎప్పటికీ మరిచిపోలేనిదని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం పరకాల పట్టణ కేంద్రంలో జరిగిన యూత్ కాంగ్రెస్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీనివాస్ మాట్లాడుతూ.. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి రాజీనామా చేస్తే పరకాల నియోజకవర్గానికి రెండు వేల కోట్లు నిధులు వస్తాయని అభిప్రాయపడ్డారు. ఆ నిధులతో పరకాల నియోజకవర్గాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. ఎమ్మెల్యే పక్క నియోజకవర్గ మండలమైన కమలాపూర్ లో దళిత బంధు ఇస్తామని చెప్పడం కాదు. సొంత నియోజకవర్గమైన పరకాలలో దళిత బంధు ఎప్పుడు అమలు చేస్తారో తెలపాలని డిమాండ్ చేశారు. ఆ స్పష్టత వెల్లడించనట్లైతే మీకు రాజకీయ భవిష్యత్తు ఉండదని హితవు పలికారు.

రాష్ట్రం ఏర్పడితే మొట్ట మొదటి ముఖ్యమంత్రి దళితుడేనని దళితులను అనేక ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి ఒక్కటీ అమలు చేసిన చరిత్ర లేదని, దళిత బంధు కూడా ఉప ఎన్నికల్లో లబ్ధి పొందే ఓ బూటకపు నినాదం తప్ప మరొకటి కాదన్నారు. ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు, దౌర్జన్యాలు పెరిగిన మాట వాస్తవం కాదా అంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు దళిత ముఖ్యమంత్రి, మూడెకరాల భూమి అంటూ బూటకపు నినాదాలతో ఎన్నికల సమయంలో ఓట్లు కొల్లగొట్టే ఉద్దేశ్యం తప్ప మరొకటి కాదని ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యేగా మీకు రాజకీయ భవిష్యత్తు కావాలంటే తక్షణం రాజీనామా చేసి పరకాల నియోజకవర్గ అభివృద్ధికిలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యేను కోరారు. ఈ కార్యక్రమంలో బుర్ర దేవేందర్ ఎంపిటిసి చందుపట్ల రాజిరెడ్డి, బాసాని సుమన్, పోరండ్ల వేణు కుమార్, బలభద్ర రాజు రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed