మే 14న డిమాండ్ డేను జయప్రదం చేయాలి: సీఐటీయూ

by Shyam |
మే 14న డిమాండ్ డేను జయప్రదం చేయాలి: సీఐటీయూ
X

దిశ‌, ఖ‌మ్మం: కొవిడ్-19పై పోరులో ముందువ‌రుసలో నిలుస్తున్న కార్మికులకు సరైన రక్షణ పరికరాలు, సౌకర్యాలు కల్పించాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. సాయిబాబు ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈనెల 14న డిమాండ్ డేను పుర‌స్క‌రించుకుని కార్మికులు భౌతిక దూరం పాటిస్తూ త‌మ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి నిరసన కార్యక్రమాలు నిర్వ‌హించాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. నర్సులు, ఆస్పత్రి సిబ్బంది, పారిశుధ్య కార్మికులు అధిక సంఖ్యలో వ్యాధిబారిన పడుతున్నార‌ని, వీరికి ప్రభుత్వం మాస్కులు, శానిటైజర్లు వంటి కనీస రక్షణ సదుపాయాలు కూడా కల్పించటం లేద‌ని ఆరోపించారు. మంగ‌ళ‌వారం ఖ‌మ్మం ప‌ట్ట‌ణంలోని మంచికంటి భవన్‌లో జరిగిన సీఐటీయూ జిల్లా కమిటీ సమావేశంలో సాయిబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తుమ్మ విష్ణువర్ధన్ కళ్యాణం, వెంకటేశ్వరరావు, ఎర్ర శ్రీకాంత్ ఎం. గోపాల్, పి.మోహన్ రావు, మైదానం. శ్రీను, తిరుమల చారి పాల్గొన్నారు.

Advertisement

Next Story