దిశ ఎఫెక్ట్: ‘కావాలనే హెల్మెట్ లేకుండా వెళ్లా’

by Shyam |
దిశ ఎఫెక్ట్: ‘కావాలనే హెల్మెట్ లేకుండా వెళ్లా’
X

దిశ ప్రతినిధి, మెదక్: లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారి పట్ల తమ పోలీసు సిబ్బంది ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనే విషయాలు తెలుసుకోవడానికే తాను కావాలనే హెల్మెట్ లేకుండా పర్యటించినట్టు సిద్దిపేట అడిషనల్ ఎస్పీ, ఏసీపీ రామేశ్వర్ ‘దిశ’ కి తెలిపారు. ‘మఫ్టీ సరే.. హెల్మెట్ ఏదీ’ అంటూ దిశలో కథనం ప్రసారం అయిన విషయం తెలిసిందే. దీనిపై ఏసీపీ స్పందించి ‘దిశ’ ప్రతినిధితో మాట్లాడారు. తాను సిద్దిపేటలోని అన్ని చెక్‌పోస్టుల వద్ద తమ సిబ్బంది ఎలా పని చేస్తున్నారని తెలుసుకోవడం కోసమే హెల్మెట్ ధరించలేదని చెప్పారు.

నిబంధనలు ఉల్లంఘించిన వారిని పోలీసులు ఎలాంటి ప్రశ్నలు వేస్తున్నారు, గోళి మాత్రలకు వెళ్తే మెడికల్ స్లిప్, ద్విచక్ర వాహనంపై వెళ్తుంటే హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ, అత్యవసర పరిస్థితి అయితే పోలీస్‌శాఖ మంజూరు చేసిన ఈ-పాస్, ఎవరైనా రికమండేషన్‌పై ఫోన్‌లో మాట్లాడిస్తే ఎలా స్పందిస్తున్నారు అనే విషయాలు తెలుసుకోవడమే తన పర్యటన ఉద్దేశమని వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed