- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కరోనా అంటూ.. యువతిపై ఉమ్మేసిన అపరిచిత వ్యక్తి
దేశ రాజధాని ఢిల్లీ.. ఇప్పటికే నిర్భయ ఘటనతో మూల్యం చెల్లించుకుంది. కరోనా నేపథ్యంలో అక్కడ మరో అవమానుషమైన ఉదంతం జరిగింది. ఓ యువతి పట్ల అనుచితంగా ప్రవర్తించడంతో పాటు, ఆమె ప్రతిఘటించడంతో.. ‘‘కరోనా’’ అంటూ ఉమ్మేశాడు. ఆదివారం రాత్రి ముఖర్జీ నగర్ ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నట్టు నార్త్‌వెస్ట్ డీసీపీ విజయంత ఆర్య పేర్కొన్నారు.
బాధితురాలి కథనం ప్రకారం.. ఆదివారం రాత్రి ఆమె విజయా నగర్‌లోని స్థానిక మార్కెట్లో నిత్యావసర వస్తువులు కొనుక్కుని ఇంటికి వెళ్తుండగా దాదాపు 50 ఏళ్లున్నవ్యక్తి ఆమెపై అనుచిత కామెంట్లు చేయడం మొదలుపెట్టాడు. ఆమె ప్రతిఘటించడంతో… యువతిపై ఉమ్మేసి ‘‘కరోనా’’ అని బిగ్గరగా అరుస్తూ అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో… ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘ఇది చదివి షాక్‌కు గురయ్యాను. ఢిల్లీ పోలీసులు నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలి. మనమంతా ఒక దేశంగా ఐక్యత చాటుకోవాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి కోవిడ్-19పై పోరాడేందుకు ఇది చాలా అవసరం..’’ అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.
Tags : CORONA VIRUS, WOMEN, SPITTING, ARVIND KEJRIWAL, DELHI, CM, SOCIAL MEDIA, VIRAL