- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వ్యవసాయ చట్టాల ప్రతులను చించిన కేజ్రీవాల్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ సాగు చట్టాల ప్రతులను సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ శాసనసభలో చించివేశారు. బ్రిటీషర్ల కంటే చెత్తగా మారకూడదని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి సూచించారు. దేశ రాజధాని సరిహద్దుల్లో రైతుల ఆందోళనలపై చర్చించడానికి గురువారం ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. కొవిడ్-19 మహమ్మారి వ్యాప్తి సమయంలో అత్యవసరంగా వ్యవసాయ చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఏముందని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
అంతకుముందు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే చట్టం ప్రతులను చించివేస్తున్న దృశ్యాలను ఆప్ విడుదల చేసింది. ఎమ్మెల్యేలు మహేంద్ర గోయల్, సోమనాథ్ భారతి కేంద్ర వ్యవసాయ చట్ట ప్రతులను చించివేశారు. రైతులు వ్యతిరేకిస్తున్న ‘నల్ల చట్టాల’ను మేం తిరస్కరిస్తున్నామని ఎమ్మెల్యేలు గోయల్, భారతి తెలిపారు. అసెంబ్లీలో చట్టాల వ్యతిరేక తీర్మానం ప్రవేశ పెట్టిన రవాణాశాఖ మంత్రి కైలాశ్ గెహ్లాట్ మాట్లాడుతూ కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్నామని, రైతులకు మద్దతు అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం నిలుస్తుందని తెలిపారు. కేంద్ర చట్టాలను వ్యతిరేకిస్తూ శాసనం చేసిన మూడో రాష్ట్రం ఢిల్లీ. అంతకుముందు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు పంజాబ్, రాజస్థాన్ అసెంబ్లీలు తీర్మానాలు పాస్ చేశాయి.