ఎన్‌హెచ్‌ఆర్సీ, ఎన్‌సీపీసీఆర్‌లకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

by Shamantha N |
ఎన్‌హెచ్‌ఆర్సీ, ఎన్‌సీపీసీఆర్‌లకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు
X

న్యూఢిల్లీ: నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ కమిషన్(ఎన్‌సీపీసీఆర్), జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్‌హెచ్ఆర్సీ)లకు ఢిల్లీ హైకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద చిన్న పిల్లలు బిక్షమెత్తడం, ప్రోడక్ట్స్ అమ్మడం లాంటివి చేయకుండా చూసుకునేలా చట్టాలు, పాలసీలు తయారు చేసేలా సంబంధింత శాఖలకు ఆదేశాలు జారీచేయాలని దాఖలైన పిటిషన్‌కు సంబంధించి ఈ నోటీసులను జారీచేసింది.

పీయూష్ చాబ్రా అనే పిటిషనర్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై అభిప్రాయాలను తెలిపాలనీ ఎన్‌సీపీసీఆర్, ఎన్‌హెచ్‌ఆర్సీలతో పాటు పలువురికి జస్టిస్ జస్మీత్ సింగ్, జస్టిస్ డీఎన్ పటేల్ లతో కూడిన ధర్మాసనం ఈ నోటీసులను జారీ చేసింది. ఢిల్లీలోని స్ట్రీట్ చిల్డ్రన్స్ హక్కులను కాపాడాలనీ, వారికి చైల్డ్ కేర్ సెంటర్లలో సరైన ఏర్పాట్లు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని ఢిల్లీ హైకోర్టును పిటిషనర్ కోరారు. ఢిల్లీలో స్ట్రీట్ చిల్డ్రన్స్ ఐడెంటీటీని వెరిఫై చేయాలనీ.. అందుకోసం వారి తల్లి దండ్రుల వివరాలు సేకరించేలనీ, వీధి బాలల చేత బిక్ష మెత్తిస్తున్న వారిని గుర్తించి వారిపై లీగల్ యాక్షన్ తీసుకునేలా ఢిల్లీ కమిషన్ ఫర్ చిల్డ్రన్ ప్రొటెక్షన్స్ రైట్స్‌‌కు ఆదేశాలు జారీ చేయాలని పిల్‌లో కోర్టుకు విన్నవించారు.

Advertisement

Next Story