వార్తలు తక్కువ.. ఒపీనియన్స్ ఎక్కువ

by Jakkula Samataha |
వార్తలు తక్కువ.. ఒపీనియన్స్ ఎక్కువ
X

దిశ, వెబ్‌డెస్క్ : నేషనల్ మీడియా చానళ్లపై బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్, ప్రొడ్యూసర్స్, నిర్మాణ సంస్థలు ఫైల్ చేసిన కేసుపై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు.. సదరు వార్తా సంస్థలపై తీవ్రంగా మండిపడింది. జస్టిస్ రాజీవ్ శక్దేర్ నేతృత్వంలోని ధర్మాసనం మీడియా సంస్థలు తమ ప్రసారాల్లో వార్తను వార్తగా చూపించకుండా.. ఒపీనియన్స్ చెప్తున్నాయని అంది. ప్రజలకు వార్తను వార్తగానే చూపించాలని సూచించింది. బాధ్యతారహిత రిపోర్టింగ్ వల్ల సెలెబ్రిటీలు ఇబ్బందులు పడకూడదని, వారిని డీఫేమ్ చేసేందుకు అసభ్యకర పదజాలం ఉపయోగించరాదని, అలాంటి కంటెంట్‌ను ప్రసారం చేయకూడదని హెచ్చరించింది.

ఈ సందర్భంగా 1997లో ప్రిన్సెస్ డయానా కేసును ప్రస్తావించిన కోర్టు.. వీడియో రిపోర్టర్లు తన కారు వెంట పరుగెత్తడం వల్లే తను ప్రమాదానికి గురైందని, అలాంటి పనులు మానుకుని సెలెబ్రిటీలకు ప్రైవసీ ఇవ్వాలని సూచించింది. స్టార్స్‌ను డీఫేమ్ చేస్తూ సోషల్ మీడియాలోనూ న్యూస్ రాకూడదన్న కోర్టు.. దీనిపై రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని మీడియా చానళ్లకు ఆదేశాలు జారీ చేసింది. ఫెయిర్ రిపోర్టు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నామని.. దురదృష్టవశాత్తు అది జరగడం లేదని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి నెలకొందన్న కోర్టు.. బ్లాక్ అండ్ వైట్ దూరదర్శన్ బెటర్ అని.. మళ్లీ దూరదర్శన్ రోజులొస్తే బాగుండేదని అభిప్రాయపడింది.

Advertisement

Next Story

Most Viewed