- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వారి కోసం ఢిల్లీ ప్రభుత్వం మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: యూకే నుంచి వచ్చే వారందరూ ఎయిర్‌పోర్టులో ఆర్‌టీపీసీఆర్ టెస్టు తప్పనిసరిగా చేసుకోవాలని, అందరూ తప్పకుండా క్వారంటైన్ లేదా ఐసొలేషన్ సెంటర్‌లో గడపాల్సిందేనని సూచించింది. ఇక్కడ కరోనాటెస్టులో నెగెటివ్ వస్తే వారం రోజులు ఇన్‌స్టిట్యూషనల్ క్వారంటైన్‌లో, మరో వారం రోజులు హోం క్వారంటైన్‌లో ఉండాలని పేర్కొంది. పాజిటివ్ వస్తే 14 రోజులపాటు ఇన్‌స్టిట్యూషనల్ ఐసొలేషన్ ఫెసిలిటీలో ఉండాలని తెలిపింది. కరోనా నెగెటివ్ వచ్చినవారు 14 రోజలపాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని కేంద్రం సూచించిన సంగతి తెలిసిందే. యూకేలో కరోనావైరస్ కొత్త స్ట్రెయిన్ వ్యాప్తిని నిరోధించడానికి కేంద్ర ప్రభుత్వం యూకే నుంచి విమానరాకపోకలను గతనెల 23 నుంచి 31వరకు పూర్తిగా నిషేధించింది. అనంతరం ఈ నెల 7వరకు పొడిగించింది. 8 నుంచి పాక్షికంగా ఆంక్షలను సడలిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో 8 నుంచి పరిమిత సంఖ్యలో యూకే నుంచి విమానాలు భారత్‌కు రానున్నాయి. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ ప్రభుత్వం శుక్రవారం మార్గదర్శకాలు విడుదల చేసింది.
82కు చేరిన కొత్త స్ట్రెయిన్ కేసులు
కొత్త రకం కరోనా కేసులు భారత్‌లో 82కు చేరాయి. ఈ నెల 6 వరకు దేశంలో మొత్తం కేసులు 73గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం వెల్లడించింది. యూకే నుంచి వచ్చి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన వారికి జీనోమ్ సీక్వెన్సింగ్ టెస్టులు చేస్తున్నామని, కొత్త రకం స్ట్రెయిన్ పాజిటివ్ అని తేలితే ప్రత్యేకంగా సింగిల్ రూమ్ ఐసొలేషన్‌లో ఉంచుతున్నామని వివరించింది. వారి కాంటాక్టులను క్వారంటైన్‌లోకి పంపిస్తున్నామని పేర్కొంది.