- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వరల్డ్స్ ఫస్ట్ వర్చువల్ మోడల్ స్కూల్@ ఢిల్లీ.. విశేషాలు
దిశ, ఫీచర్స్ : గతేడాది కరోనా మహమ్మారి సృష్టించిన బీభత్సం భారీ మార్పులకే దారితీసింది. ముఖ్యంగా విద్యారంగంలో గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయి. ఆన్‌లైన్ లెస్సన్స్ షురూ అయ్యాయి. ఇన్‌స్టిట్యూషన్స్ ‘డిజిటల్ ఎడ్యుకేషన్’ బాట పట్టాయి. మానవజీవితంలో స్మార్ట్ ఫోన్లు అనేవి ఇప్పుడు అత్యవసరం కావడంతో పాటు జీవితంలో అంతర్భాగం అయిపోగా.. భవిష్యత్తు ‘డిజిటల్ యుగానిదే’ అనేది సత్యం. ఈ నేపథ్యంలో ఢిల్లీ సర్కారు రాష్ట్ర అసెంబ్లీలో ఓ వినూత్న ప్రయత్నాన్ని ప్రతిపాదించింది. ‘వర్చువల్ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్’ తీసుకురాబోతున్నట్లు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా వెల్లడించారు. ఈ అకడమిక్ ఇయర్ 2021-22కి గాను యూనిక్ ఎక్స్‌పరిమింట్ చేయబోతున్నట్లు తెలిపారు.
‘వర్చువల్ మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్’ సిస్టం ద్వారా విద్యార్థులు దేశంలో లేదా ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తమ క్లాసెస్‌కు అటెండ్ అయ్యే చాన్స్ ఉందని చెప్పారు మనీశ్ సిసోడియా. తాము రూపొందించబోయే ఈ న్యూ వర్చువల్ ఢిల్లీ మోడల్ స్కూల్‌లో సాధారణంగా ఉండే తరగతి గది మాదిరి నాలుగు గోడలు ఉండబోవన్నారు. టీచర్స్ స్టూడెంట్స్ కోసం డిఫరెంట్ అసెస్‌మెంట్స్ ఇస్తామని, యూనిక్ అంబియెన్స్ ఉండేలా క్రియేట్ చేస్తామని తెలిపారు. ‘ఎనివేర్ లివింగ్, ఎనివేర్ లెర్నింగ్, ఎనిటైం టెస్టింగ్’ అనే ప్రిన్సిపుల్ ఆధారంగా ఈ వర్చువల్ స్కూల్స్ స్టార్ట్ చేయబోతున్నట్లు, వీటి ద్వారా స్టూడెంట్స్‌కు ఫుల్ బెనిఫిట్స్ అందేలా చర్యలు తీసుకోబోతున్నట్లు తెలిపారు. కొవిడ్ పాండమిక్ వల్ల విద్యారంగంలో టెక్నాలజీ ఎఫెక్టివ్‌గా యూజ్ చేస్తున్నారని, అయితే ఇంకా పెరగాల్సి ఉందని మనీశ్ చెప్పారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ డ్రీమ్ ప్రాజెక్టు అయిన ‘వర్చువల్ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్’ త్వరలో సాకారం కాబోతుండడం ఆనందంగా ఉందన్నారు.