ఉత్కంఠ పోరులో ఢిల్లీ గెలుపు

by Anukaran |
ఉత్కంఠ పోరులో ఢిల్లీ గెలుపు
X

దిశ, వెబ్‌డెస్క్: ఉత్కంఠగా సాగిన కోల్‌కతా వర్సెస్ ఢిల్లీ మ్యాచ్‌లో క్యాపిటల్స్ విజయం సాధించింది. 18 పరుగుల లేడాతో రైడర్స్‌ను చిత్తు చేసింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ 228 స్కోర్ చేసింది.

సెకండ్ ఇన్నింగ్స్:

ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా రైడర్స్ ఆదిలోనే కుప్పకూలారు. 8 పరుగుల వద్దనే ఓపెనర్ సునీల్ నరైన్3 రన్స్ తీసి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత 72 పరుగుల వద్ద శుబ్‌మన్‌గిల్ కూడా ఔట్ అయ్యాడు. దీనికి తోడు హార్డ హిట్టర్ ఆండ్రూ రస్సెల్ కూడా కేవలం 13 పరుగులు చేసి 94 స్కోర్ బోర్డు వద్ద చేతులేత్తేశాడు.

ఇక వన్‌డౌన్‌లో వచ్చిన నితీష్ రానా కాసేపు బ్యాటింగ్‌తో చెలరేగాడు. 35 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు రాబట్టి 58 పరుగులు చేశాడు. ఆ తర్వాత 117 పరుగుల వద్ద హర్షల్ వేసిన బౌలింగ్‌లో క్యాచ్ అవుట్ అయ్యాడు. 117 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన కోల్‌కతా పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ దినేష్ కార్తీక్(6) పేలవ ప్రదర్శన చేశాడు.

ఇటువంటి సమయంలో ఇయాన్ మోర్గాన్ ఒక్కసారిగా చెలరేగిపోయాడు. ఆకాశమే హద్దుగా బంతిని బౌండరీలు పారించి కోల్‌కతాకు‌ గెలుపు ఆశలు కల్పించాడు. కేవలం 18 బంతుల్లో 1 ఫోర్, 5 సిక్సులు బాది స్కోర్ బోర్డు 200 వైపు లాక్కెల్లాడు. మోర్గాన్‌కు తోడు రాహుల్ త్రిపాఠి మంచి ఇన్నింగ్స్ ఆడాడు.
వీరిద్దరు కలిసి మ్యాచ్ గెలిపించే సమయంలో నార్ట్జే కోల్‌కతా ఆశల పై నీళ్లు చల్లాడు. వెంట వెంటనే మోర్గాన్, రాహుల్ త్రిపాఠి వికెట్లను పడగొట్టి ఢిల్లీని గెలిపించాడు. దీంతో నిర్ధిష్ఠ 20 ఓవర్లలో కోల్‌కతా నైట్ రైడర్స్ 8 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. 18 పరుగుల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది.

స్కోర్ బోర్డు:

Delhi Capitals Innings: పృథ్వీ షా (c) శుబ్‌మన్ గిల్ (b) నాగర్‌కోటి 66(41) శిఖర్ దావన్ (c) మోర్గాన్ (b) వరుణ్ చక్రవర్తి 26(16), శ్రేయాస్ అయ్యర్ (c)నాటౌట్ 88(38) రిషబ్ పంత్ (wk)(c) శివం మావి (b) ఆండ్రూ రస్సెల్ 38(17), మార్క్యూస్ స్టోయినిస్ (c) వరుణ్ చక్రవర్తి (b) ఆండ్రూ రస్సెల్ 1(2), హెట్మేయర్ నాటౌట్ 7(5) ఎక్స్‌ట్రాలు 2 మొత్తం స్కోరు 228/4

వికెట్ల పతనం: 56-1 (శిఖర్ దావన్, 5.5), 129-2 (పృథ్వీ షా, 12.4), 201-3 (రిషబ్ పంత్, 17.5), 221-4 (మార్క్యుస్ స్టోయినిస్, 19.1)

బౌలింగ్: ప్యాట్ కమ్మిన్స్ 4-0-49-0, శివం మావి 3-0-40-0, వరుణ్ చక్రవర్తి 4-0-49-1, సునీల్ నరైన్ 2-0-26-0, ఆండ్రూ రస్సెల్ 4-0-29-2, కమలేష్ నాగర్‌కోటి 3-0-35-1.

Kolkata Knight Riders Innings: శుబ్‌మన్ గిల్ (c) పంత్ (b) మిశ్రా 28(22), సునీల్ నరైన్ (b) నార్ట్జే 3(5), నితీస్ రానా (c) (sub) అక్సర్ (b) హర్షల్ పటేల్ 58(35),ఆండ్రూ రస్సెల్ (c) నార్ట్జే (b) రబాడా 13(8), దినేష్ కార్తీక్ (c) (wk)c దావన్ (b) హర్షల్ పటేల్ 6(8) ఇయన్ మోర్గాన్ (c) హెట్మేయర్ (b) నార్ట్జే 44(18), ప్యాట్ కమ్మిన్స్ (c) హర్షల్ పటేల్ (b) నార్ట్జే 5(4)రాహుల్ త్రిపాఠి (b)36(16) కమలేష్ నాగర్‌కోటి నాటౌట్ 3(3), శివం మావి 1(3) ఎక్స్‌ట్రాలు 13, మొత్తం స్కోర్210/8.

వికెట్ల పతనం: 8-1 (సునీల్ నరైన్ 1.2), 72-2 (శుబ్‌మన్ గిల్, 8.1), 94-3 (ఆండ్రూ రస్సెల్, 9.5), 117-4 (నితీష్ రానా, 12.4), 117-5 (దినేష్ కార్తీక్, 12.5), 122-6 ( ప్యాట్ కమ్మిన్స్, 13.3).

బౌలింగ్: కగిసో రబాడా 4-0-51-1, నార్ట్జే 4-0-33-3, రవి చంద్రన్ అశ్వన్ 2-0-26-0, మార్క్యుస్ స్టోయినిస్ 4-0-46-1, హర్షల్ పటేల్ 4-0-34-2, అమిత్ మిశ్రా 2-0-14-1.

పాయింట్ టేబుల్

Advertisement

Next Story

Most Viewed