- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం
దిశ, వెబ్‌డెస్క్: 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ చివరి వరకు పోడాడి ఓడింది. ఢిల్లీ బౌలర్లు ఒత్తిడి పెంచి పరుగులను కట్టుదిట్టం చేస్తూ ఇదే సమయంలో వికెట్లను తీశారు. దీంతో 13 పరుగుల తేడాతో ఢిల్లీ రాజస్తాన్ పై విజయం సాధించింది.
రాజస్తాన్ ఇన్నింగ్స్:
రాజస్తాన్ రాయల్స్ నుంచి ఓపెనింగ్ దిగిన జోస్ బట్లర్, బెన్ స్టోక్స్ క్రీజులో ఉన్నంత సేపు మ్యాచ్ వన్‌సైడ్‌లా కనిపించింది. కానీ, బౌండరీల ఊపు మీద ఉన్న జోస్ బట్లర్(22)ను నార్ట్జే క్లీన్ బోల్డ్ చేశాడు. దీంతో 37 పరుగుల వద్ద రాయల్స్ మొదటి వికెట్ కోల్పోయింది. ఇక ఇదే అదును చేసుకున్న ఢిల్లీ బౌలర్లు ఆర్ఆర్ బ్యాట్స్‌మెన్ల పై ఒత్తిడి పెంచారు. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన స్టీవ్ స్మిత్(1) పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు.
ఓపెనర్ బెన్ స్టోక్స్ కాసేపు క్రీజులో ఉండి (41) పరుగులు చేశాడు. ఇదే సమయంలో తుషర్ పాండే వేసిన బంతిని షాట్ ఆడబోయి లలిత్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో 86 పరుగుల వద్ద ఆర్ఆర్ 3 వికెట్లను కోల్పోయింది. ఇక మిడిలార్డర్‌లో వచ్చిన సంజుశాంసన్(25), రాబిన్ ఉతప్ప (32) పరుగులు చేసి పెవిలియన్ చేరారు. ఇక రియాన్ పరాగ్ (1), జోఫ్రా ఆర్చర్ (1), శ్రేయస్ గోపాల్(6) పరుగులు చేసి ఔట్ అయ్యారు. రాహుల్ తెవాతియ (14) పరుగులతో నాటౌట్‌గా నిలిచినా అవసరమైన ఇన్నింగ్స్ చేయకపోవడంతో రాజస్తాన్ మరో ఓటమిని ముటగట్టుకుంది. బ్యాట్స్‌మెన్ల పేలవ ప్రదర్శన కారణంగా ఆర్ఆర్ కేవలం 148 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 13 పరుగుల తేడాతో ఢిల్లీ విజయం లాంఛనమైంది.
ఢిల్లీ ఇన్నింగ్స్:
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ పర్వాలేదనిపించింది. నిర్ధిష్ఠ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. పృథ్వీ షా(0) డకౌట్ అయినా.. శిఖర్ ధావన్(57), శ్రేయాస్ అయ్యర్(53) హాఫ్ సెంచరీలు చేసి జట్టు స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లారు. వీరిద్దరు పెవిలియన్ చేరిన తర్వాత అజింక్య రహనే(2), మార్క్యుస్ స్టోయినిస్(18), అలెక్స్ కారీ(14), అక్సర్ పటేల్(7) పరుగులు చేసి ఔట్ అయ్యారు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ 161 పరుగులు చేసింది.
స్కోరు బోర్డు:
Delhi Capitals Innings: 161-7 (20 Ov)
1. పృథ్వీ షా b జోఫ్రా ఆర్చర్ 0(1)
2. శిఖర్ ధావన్ c కార్తీక్ త్యాగి b శ్రేయస్ గోపాల్ 57(33)
3. అజింక్య రహనే c ఉతప్ప b జోఫ్రా ఆర్చర్ 2(9)
4. శ్రేయాస్ అయ్యర్ (c)c జోఫ్రా ఆర్చర్ b కార్తీక్ త్యాగి 53(43)
5. మర్క్యుస్ స్టోయినిస్ c రాహుల్ తెవాతియ b జోఫ్రా ఆర్చర్ 18(19)
6. అలెక్స్ కారీ (wk)c జోఫ్రా ఆర్చర్ b ఉనాద్కట్ 14(13)
8. అక్సర్ c కార్తీక్ త్యాగి b ఉనాద్కట్ 7(4)
9. అశ్విన్ నాటౌట్ (0)0
ఎక్స్‌ట్రాలు: 10
మొత్తం స్కోరు: 161/7
వికెట్ల పతనం: 0-1 (పృథ్వీ షా, 0.1), 10-2 (రహనే, 2.3), 95-3 (ధావన్, 11.4), 132-4 (శ్రేయాస్ అయ్యర్, 15.6), 153-5 (స్టోయినిస్, 18.6), 157-6 (అలెక్స్ కారీ, 19.4), 161-7 ( అక్సర్, 19.6)
బౌలింగ్:
జోఫ్రా ఆర్చర్ 4-0-19-3
ఉనాద్కట్ 3-0-32-2
కార్తీక్ త్యాగి 4-0-30-1
స్టోక్స్ 2-0-24-0
శ్రేయస్ గోపాల్ 4-0-31-1
రాహుల్ తెవాతియ 3-0- 23-0
Rajasthan Royals Innings: 148-8 (20 Ov)
1. బెన్ స్టోక్స్ c (sub)లలిత్ యాదవ్ b తుషర్ దేశ్‌పాండే 41(35)
2. జోస్ బట్లర్ (wk)b నార్ట్జే 22(9)
3. స్టీవ్ స్మిత్ (c)c and b అశ్విన్ 1(4)
4. సంజు శాంసన్ b అక్సర్ 25(18)
5. రాబిన్ ఉతప్ప b నార్ట్జే 32(27)
6. రియాన్ పరాగ్ రనౌట్ (అక్సర్) 1(2)
7. రాహుల్ తెవాతియ నాటౌట్ 14(18)
8. జోఫ్రా ఆర్చర్ b రహనే c రబాడా 1(4)
9.శ్రేయస్ గోపాల్ b అక్సర్ c తుషర్ 6(4)
ఎక్స్‌ట్రాలు: 5
మొత్తం స్కోరు: 148
వికెట్ల పతనం: 37-1 (జోస్ బట్లర్, 2.6), 40-2 (స్టీవ్ స్మిత్, 3.6), 86-3 (బెన్ స్టోక్స్, 10.2), 97-4 (సంజు శాంసన్, 11.4), 110-5 (రియాన్ పరాగ్, 13.2)135-6 (రాబిన్ ఉతప్ప, 17.3), 138-7 (జోఫ్రా ఆర్చర్, 18.4).
బౌలింగ్:
కగిసో రబాడా 4-0-28-1
తుషర్ దేశ్‌పాండే 4-0-37-2
ఎన్రిచ్ నార్ట్జే 4-0-33-2
రవిచంద్రన్ అశ్విన్ 4-0-17-1
అక్సర్ పటేల్ 4-0-32-1