- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఢిల్లీ కాపిటల్స్ టార్గెట్ -201
దిశ, వెబ్‌డెస్క్: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై జట్టు మ్యాచ్ ప్రారంభం నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్లు రోహిత్ శర్మ మొదటి ఓవర్లోనే lbwగా వెనుదిరగగా, మరో ఓపెనర్ డికాక్ తన దైన బ్యాటింగ్ శైలితో పరుగుల వరద పారించాడు. ఫోర్లు, సిక్సులతో ఢిల్లీ బౌలర్లపై విరుచుక పడ్డాడు. ఆ తర్వాత అశ్విన్ వేసిన బంతిని భారీషాట్‌కు యత్నించి ధావన్‌కు దొరికిపోయాడు. అప్పటికే ముంబై రెండు వికెట్లు కోల్పోయి 78-2 పరుగులు చేసింది.
అనంతరం, మూడోస్థానంలో బ్యాటింగ్‌కు దిగిన సూర్యకుమార్ యాదవ్ కూడా అద్బుతమైన ప్రదర్శన చేశాడు. ఇషాన్ కిషన్ భాగస్వామ్యంతో స్టైక్ రోటెట్ చేస్తూనే, వచ్చిన బంతిని వచ్చినట్లే బౌండరీలకు మలుస్తూ తక్కువ బంతుల్లోనే యాదవ్ 51(35 )అద్భుతమైన హాఫ్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత యాదవ్ నార్తజే బౌలింగ్‌లో డానియల్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే ఢిల్లీ బౌలర్లు విజృంభిచారు. ఢిల్లీ బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ చెలరేగడంతో ముంబై కీలక ఆటగాళ్లు పెవిలియన్ చేరారు.
మ్యాచ్ చివరి ఓవర్లలో ఇషాన్ కిషన్, హార్దిక పాండ్యా క్రీజులో కుదురుకునే ప్రయత్నం చేశారు. బంతులను సింగిల్స్, డబుల్స్ ఆడుతూనే స్కోర్ బోర్డును పెంచడంలో కృషి చేశారు. చివరి రెండు ఓవర్లలో హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ ఢిల్లీ బౌలర్లపై పంజా విసిరారు. కిషన్ 55(30) ( 4ఫోర్లు, 3సిక్సులు)తో పాటు పాండ్యా కూడా తక్కువ బంతుల్లోనే 37(14) (ఐదు సిక్సులు) చెలరేగి ఆడారు. దీంతో ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది.
స్కోరుబోర్డు:
Mumbai indians innings: 200-5(20 Over)
1.రోహిత్ శర్మ 0(1)(c)lbw b అశ్విన్
2. డికాక్ 40(25) c దావన్ b అశ్విన్
3. సూర్యకుమార్ యాదవ్ 51(38) c డానియల్ b నార్తజే
4. పోలార్డ్ 0(2)c రబాడా b అశ్విన్
5. కృనాల్ పాండ్యా 13(10)c డానియల్ b స్టోనిస్
6.ఇషాన్ కిషన్ 55(30) నాటౌట్,
7.హార్దిక్ పాండ్యా 37(14)నాటౌట్
ఎక్స్‌ట్రాలు: 4
మొత్తం స్కోరు: 200
వికెట్ల పతనం: 16-1 (రోహిత్ శర్మ, 1.3), 78-2 (డికాక్, 7.4) 100-3 ( సూర్యకుమార్ యాదవ్, 11.5), 101-4 (పొలార్డ్ , 12.2) 140-5(కృనాల్ పాండ్యా, 16.1)
బౌలింగ్:
1. డానియెల్ సామ్స్ 4-0-44-0
2. రవిచంద్రన్ అశ్విన్ 4-0-29-3
3. రబాడా 4-0-42-0
4. అక్సర్ పటేల్ 3-0-27-0
5. నార్త్ జే 4-0-50-1
6.స్టోనిస్ 1-0-5-1