- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
SRH ముందు భారీ స్కోరు.. ఫైనల్స్ చేరేదెవరు?
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ క్వాలిఫయర్-2లో ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోర్ నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. ఢిల్లీ నుంచి ఓపెనింగ్ వచ్చిన స్టోయినిస్ 27 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్ బాది 38 పరుగులతో రాణించాడు. ఆ తర్వాత 86 పరుగుల వద్ద రషీద్ ఖాన్ వేసిన బంతికి క్లీన్ బోల్డ్ అయ్యాడు.
వన్‌డౌన్‌లో వచ్చిన శ్రేయాస్ అయ్యర్(21) పరుగులతో పర్వాలేదనిపించాడు. ఇక ఓపెనింగ్ నుంచి సమిష్టిగా రాణించిన శిఖర్ ధావన్ 50 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 78 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 126 పరుగుల వద్ద అయ్యర్ క్యాచ్ ఔట్ కాగా.. 178 పరుగుల వద్ద గబ్బర్ lbwతో పెవిలియన్ చేరాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ 178 స్కోర్ బోర్డు వద్ద 3 వికెట్లు కోల్పోయింది.
శిఖర్‌కు తోడుగా మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ షిమ్రాన్ హెట్మేయర్ కూడా చెలరేగి ఆడాడు. 22 బంతుల్లో 4 ఫోర్లు 1 సిక్సర్ కొట్టి 42 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇక రిషబ్ పంత్ కూడా 3 బంతులను ఎదుర్కొని 2 పరుగులు చేసేసరికి నిర్ణీత 20 ఓవర్లు ముగిశాయి. దీంతో 3 వికెట్ల నష్టానికి ఢిల్లీ క్యాపిటల్స్ 189 పరుగులు చేయగలిగింది. ఇక 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ ఎటువంటి ప్రదర్శన కనబరుస్తుందో అన్న అంశం అభిమానుల్లో ఉత్కంఠను రేపుతోంది.
స్కోర్‌బోర్డ్:
Delhi Capitals Innings: 189-3 (20 Ov)
1. మార్కస్ స్టోయినిస్ b రషీద్ ఖాన్ 38(27)
2. శిఖర్ ధావన్ lbw b సందీప్ శర్మ 78(50)
3. శ్రేయాస్ అయ్యర్ (c)c మనీష్ పాండే b హోల్డర్ 21(20)
4. షిమ్రాన్ హెట్మేయర్ నాటౌట్ 42(22)
5.రిషబ్ పంత్ నాటౌట్ 2(3)
ఎక్స్‌ట్రాలు: 8
మొత్తం స్కోరు: 189-3
వికెట్ల పతనం: 86-1 (మార్కస్ స్టోయినిస్, 8.2), 126-2 (శ్రేయాస్ అయ్యర్, 13.6), 178-3 (శిఖర్ ధావన్, 18.3)
బౌలింగ్:
1. సందీప్ శర్మ 4-0-30-1
2. జాసన్ హోల్డర్ 4-0-50-1
3. షాబాష్ నదీమ్ 4-0-48-0
4. రషీద్ ఖాన్ 4-0-26-1
5. టి నటరాజన్ 4-0-32-0