ఐపీఎల్​లో రబాడ అరుదైన రికార్డు

by Anukaran |
ఐపీఎల్​లో రబాడ అరుదైన రికార్డు
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌లో శనివారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫాస్ట్ బౌలర్ రబాడ అరుదైన ఘనత సాధించాడు. లీగ్​లో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన బౌలర్​గా రికార్డు సృష్టించాడు. 27 మ్యాచ్​ల్లోనే రబాడ ఈ ఫీట్ సాధించాడు. అతని తర్వాత సునీల్ నరైన్(32 మ్యాచ్​లు), మలింగ(33), తాహిర్(35), మెక్లనగన్(36), అమిత్ మిశ్రా(37) ఉన్నారు. ఇక 50 వికెట్లు తీసేందుకు తక్కువ బంతులు వేసిన బౌలర్​గానూ రబాడ సత్తా చాటాడు.

Advertisement

Next Story