- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ.. టార్గెట్ ఎంత?
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ సీజన్ 13లో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ఫైనల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌ను ఢీ కొనేందుకు, ఐపీఎల్ కప్ కొట్టేందుకు క్వాలిఫయర్-2 మ్యాచ్ కీలకంగా మారింది. ఈ నేపథ్యంలోనే మరికాసేపట్లో షేక్ జాయేద్ క్రికెట్ స్టేడియం, అబుదాబి వేదికగా క్వాలిఫయర్-2 మ్యాచ్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు సమాయత్తం అయ్యాయి. ఎలాగైనా మ్యాచ్‌లో విజయం సాధించి ఫైనల్స్ వెళ్లేందుకు వార్నర్ సేన-అయ్యర్ జట్లు తహతహలాడుతున్నాయి. ఇక మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన DC బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక తొలుత బ్యాటింగ్ దిగిన ఢిల్లీ భారీ టార్గెట్ నమోదు చేస్తోందన్న అంచనాలు పెరిగాయి.
SRH-DC జట్ల బలాలు-బలహీనతలు:
ఐపీఎల్ సీజన్ 13లో ఫస్ట్ హాఫ్‌లో వరుస విజయాలతో దూసుకెళ్లిన ఢిల్లీ క్యాపిటల్స్… ఆ గెలుపులతోనే ప్లే ఆఫ్స్ చేరుకుందని చెప్పాలి. ఎందుకంటే సెకండ్ హాఫ్‌లో ఫామ్ కోల్పోయిన శ్రేయాస్ అయ్యర్ జట్టు చివరి 5 మ్యాచుల్లో కేవలం ఒక దాంట్లోనే గెలుపు నమోదు చేయగా మిగతా 4 మ్యాచుల్లో పరాజయం పొందింది. ఇదే కంటిన్యూ అయితే ఢిల్లీ జట్టుకు ఓటమి తప్పదని క్రికెట్ విశ్లేషకులు గట్టిగా వాదిస్తున్నారు. బ్యాటింగ్ ఆర్డర్ రాణిస్తే మాత్రం హైదరాబాద్ ఓటమి తప్పదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా ఛేజింగ్ చేయడం ఢిల్లీకి కష్టతరం అయినట్టు ఇటీవల మ్యాచుల్లో తేలింది. దీంతోనే ఈ రోజు మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ తీసుకున్నట్టు తెలుస్తోంది. బ్యాటింగ్ ఆర్డర్ పరిశీలిస్తే.. పృథ్శీ షా, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, అజింక్య రహనే, రిషబ్ పంత్, మార్క్యూస్ స్టోయినిస్, షిమ్రాన్ హెట్మేయర్, అక్సర్ పటేల్ వంటి ఆటగాళ్లతో టాప్ ఆర్డర్ స్ట్రాంగ్‌గా ఉంది. ఇక బౌలింగ్‌లో రబాడా, స్టోయినిస్, హెట్మేయర్, రవిచంద్రన్ అశ్విన్, నొర్ట్జేతో బలంగా కనిపిస్తోంది. ఇంతటి సామర్థ్యాలు కలిగిన జట్టు క్వాలిఫయర్-1లో 0 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన పరిస్థితి మరీ దారుణం. హైదరాబాద్‌తో మరి కాసేపట్లో జరిగే మ్యాచ్‌లో విజయం ముఖ్యంగా బ్యాట్స్‌మెన్ల పైనే ఆధారపడి ఉందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈ సీజన్‌లో ఎన్నో ఎదురుదెబ్బలకు గురవుతూ చివరకు ప్లే ఆఫ్స్ చేరింది. ఫస్ట్ హాఫ్‌లో గెలుపోటములను నమోదు చేసిన సన్‌రైజర్స్ నెట్ రన్ రేట్‌ను మాత్రం స్థిరంగా కొనసాగిస్తూ వచ్చింది. ఇక చివరి నాలుగు మ్యాచుల్లో మాత్రం వరుస విజయాలను నమోదు చేసింది. ముంబై ఇండియన్స్, రాజస్తాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లను చివరి మ్యాచుల్లో బోల్తా కొట్టించింది. ఇందులో లీగ్ దశలో RCBని ఓడించగా.. ప్లే ఆఫ్స్‌లో కూడా RCBని చిత్తు చేసి ఇంటికి పంపింది. ఇక ఇదే ఉత్సాహం, ఉత్తేజంతో మరికాసేపట్లో జరగబోయే క్వాలిఫయర్-2కు సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే ముంబై జట్టుకు కూడా గట్టి పోటీనిస్తుందనడంలో సందేహం లేదు. ఆఖరికి కప్పు కొట్టిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని హైదరాబాద్ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
SRH జట్టు బ్యాటింగ్ విషయానికొస్తే ఇదివరకు బెయిర్ స్టో-వార్నర్ భాగస్వామ్యం అప్పుడప్పుడే క్లిక్ అయింది. కానీ, వృద్ధిమాన్ సాహ ఎంట్రీతో జట్టుకు కాసింత బలం చేకూరింది. ఆ తర్వాతే వరుస విజయాల వైపు హైదరాబాద్ కదిలింది. ఇక మిడిలార్డర్‌లో విలియమ్సన్ మెరవడంతో కొన్ని మ్యాచులు గట్టుకెక్కాయి. డేవిడ్ వార్నర్, శ్రీవత్సవ గోస్వామి/వృద్ధిమాన్ సాహ, మనీష్ పాండే, విలియమ్సన్, ప్రియమ్ గార్గ్, జాసన్ హోల్డర్, అబ్దుల్ సమద్ వంటి వారు మంచి ఆటగాళ్లు అని పేరున్న సంగతి తెలిసిందే.
కానీ, చాలా వరకు ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్లు వికెట్ కోల్పోయిన సమయంలో హైదరాబాద్‌ను ఆదుకోవడంలో 90 శాతం మిడిలార్డర్ విఫలం అయ్యారు. ఇటీవల జరిగిన మ్యాచ్‌లల్లో మిడిలార్డర్లు విలియమ్సన్, హోల్డర్ చొరవతో విజయం లాంఛనమైంది. అయితే, ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే బ్యాటింగ్ విషయంలో ఎటువంటి డోకా ఉండదు. బౌలింగ్ విషయంలో ఇటీవల జట్టులోకి వచ్చిన సందీప్ శర్మ అద్భుత ప్రదర్శన చేస్తుండగా.. రషీద్ ఖాన్ మొదటి నుంచే సత్తా చాటుతున్నాడు. అటు ఫాస్ట్ బౌలర్ జాసన్ హోల్డర్ కూడా కీలక సమయంలో వికెట్లు తీస్తున్నాడు. జట్టులోని బ్యాటింగ్-బౌలింగ్ ఆర్డర్ పటిష్టంగా రాణిస్తే హైదరాబాద్ జట్టు ఫైనల్స్‌కు వెళ్లడం ఖాయం. కానీ, ఢిల్లీ జట్టులో కూడా అత్యంత సామర్థ్యాలు కలిగిన ఆటగాళ్లు ఉండడంతో ఈ రోజు జరిగే మ్యాచ్ మరింత రసవత్తరంగా మారింది.